AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Kavitha: ఢిల్లీలో ఇవాళ మహిళా బిల్లుపై కవిత రౌండ్‌ టేబుల్ మీటింగ్.. హాజరుకానున్న ప్రతిపక్ష పార్టీల నేతలు

ఢిల్లీలో ఇవాళ మహిళా బిల్లుపై రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. 

MLC Kavitha: ఢిల్లీలో ఇవాళ మహిళా బిల్లుపై కవిత రౌండ్‌ టేబుల్ మీటింగ్.. హాజరుకానున్న ప్రతిపక్ష పార్టీల నేతలు
MLC Kavitha
Sanjay Kasula
|

Updated on: Mar 15, 2023 | 8:02 AM

Share

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయలుదేరారు. భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఇవాళ న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పార్టీలు, పౌర సామాజిక సంస్థలతో కలిసి రౌండ్‌ టేబుల్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇందులో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలనే అంశంపై ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చర్చించనున్నారు. ఢిల్లీలోని ఓ హోటల్‌లో మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఈ సమావేశం ఉండనుంది. ఈ సమావేశాన్ని భారత్ జాగృతి సంస్థ ప్రతినిధులు భారీగా హాజరుకానున్నారు. అయితే ఈడీ విచారణ కంటే ఓ రోజు ముందుగానే ఢిల్లీకి కవిత వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ కవిత ఇదివరకే మార్చి 10న ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈడి విచారణను నుంచి దృష్టి మళ్లించడానికే కవిత నిరాహారదీక్ష చేపట్టారని బిజెపి, కాంగ్రెస్ ఆరోపించాయి.

అయితే ఎమ్మెల్సీ కె.కవిత ఇప్పటికే మార్చి 11న తన వాంగ్మూలాన్ని ఈడి ముందు ఇచ్చారు. ఆమెను ఈడి తొమ్మిది గంటలపాటు ప్రశ్నించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని, మనీలాండరింగ్ జరిగిందని ఈడి నేరారోపణ చేసింది. ఇదిలావుండగా కవితను మార్చి 16న కూడా విచారించేందుకు ఈడి సమన్లు ఇచ్చిందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..