Bullet Train: దూసుకొస్తున్న బుల్లెట్ రైలు.. ఇప్పటికే 26 శాతం పనులు పూర్తి.. కీలక వివరాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్..

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, డిసెంబర్ 2023 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో బుల్లెట్ రైలు పరుగులు పెట్టడానికి..

Bullet Train: దూసుకొస్తున్న బుల్లెట్ రైలు.. ఇప్పటికే 26 శాతం పనులు పూర్తి.. కీలక వివరాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్..
Bullet Train
Follow us

|

Updated on: Mar 15, 2023 | 9:35 AM

భారతదేశంలో బుల్లెట్ రైలు ఎప్పుడు వస్తుందో చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు ఆగష్టు 2026లో ప్రారంభం కానుందని.. తదుపరి ఏడాది మరో పెద్ద విభాగాన్ని ప్లాన్ చేయబోతున్నామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తుందని.. ఇప్పటికే అనేక కంపెనీలు ఈ ప్రాజెక్ట్‌తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్, డిసెంబర్ 2023 నాటికి పూర్తి కావాల్సి ఉన్నా.. కొన్ని కారణాలతో బుల్లెట్ రైలు పరుగులు పెట్టడానికి మరో మూడేళ్ల పట్టే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 26% పని పూర్తయిందని ఆయన తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ సిద్ధం కావడానికి 3 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విషయమై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2026 ఆగస్టు నెల నుండి దేశంలోని మొట్టమొదటి బుల్లెట్ రైలు ట్రాక్‌పై పరుగెత్తడం ప్రారంభం అవుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రాజెక్టును నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అన్నారు.

జపాన్ ప్రభుత్వ సహకారంతో 2026 ఆగస్టు నుంచి బుల్లెట్ రైలు పరుగులు తీయగలదన్న నమ్మకం ఉందని రైల్వే మంత్రి అభిప్రాయపడ్డారు.  ట్విట్టర్‌లో ఈ వివరాలను షేర్ చేశారు. ఫిబ్రవరి 28, 2023 నాటికి మొత్తం 26.33 శాతం పూర్తి అయ్యిందని.. మహారాష్ట్ర మొత్తం పనిలో 13.72 శాతం పూర్తి చేసిందని పేర్కొన్నారు.

మరోవైపు గుజరాత్ సివిల్ వర్క్‌లో 52 శాతానికి పైగా పూర్తి చేసిందన్నారు. ప్రస్తుతం మొత్తం 36.93 శాతం పూర్తి చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కోసం, ప్రస్తుతానికి, 8000 చెట్లను నాటడం, 83,600 మొక్కలు నాటడం జరిగిందన్నారు.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ వివరాలు ఇవే..

1. ముంబై-అహ్మదాబాద్ మార్గం దేశంలో ఆమోదించబడిన ఏకైక హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అమలులో జపాన్ ప్రభుత్వం సహాయం చేస్తోంది.

2. కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్‌లో హై-స్పీడ్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో 508 కిలోమీటర్లు,12 స్టేషన్‌లలో ప్రయాణిస్తాయి. రోజుకు 35 రైళ్లు/ఒక దిశలో ఉంటాయి. రద్దీ సమయాల్లో ప్రతి 20 నిమిషాలకు, నాన్-పీక్ అవర్స్‌లో ప్రతి 30 నిమిషాలకు నడుస్తాయి.

పరిమిత స్టాప్ సర్వీస్‌తో (సూరత్ – వడోదరలో) ఈ దూరాన్ని ఒక గంట 58 నిమిషాల్లో, ఆల్ స్టాప్‌ల సర్వీస్‌తో రెండు గంటల 57 నిమిషాల్లో కవర్ చేయబడుతుంది. MAHSR కారిడార్.. కార్యాచరణ నియంత్రణ కేంద్రం సబర్మతిలో ఉంటుంది.

3. ₹ 1,10,000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబడిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో 92 శాతం ఎలివేట్ చేయబడుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

4. వారణాసి – ఢిల్లీ మధ్య మరో బుల్లెట్ రైలు ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. సాధ్యాసాధ్యాల అధ్యయనం జరుగుతోంది.

ప్రతిపాదిత 985 కిలోమీటర్ల వారణాసి-ఢిల్లీ బుల్లెట్ రైలు కారిడార్‌లో ఢిల్లీ, నోయిడా, జేవార్ ఎయిర్‌పోర్ట్, ఆగ్రా, మధుర, న్యూ ఇటావా, సౌత్ కన్నౌజ్, లక్నో, అయోధ్య, రాయ్ బరేలీ, ప్రయాగ్‌రాజ్, న్యూ భదోహి మరియు వారణాసితో సహా కనీసం 13 స్టేషన్లు ఉంటాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం