AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. భర్తను, ఆస్తిని, జీతాన్ని భార్యలకు సమానంగా పంచిన ఫ్యామిలీ కోర్టు.. ఎక్కడంటే

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుని, అతని సంపాదన, ఆస్తులను ఏ భార్యకు ఇబ్బంది కల్గకుండా సమానంగా పంచింది ఓ ఫ్యామిలీ కోర్టు. వారంలోని ఏడు రోజుల్లో మూడు రోజులు ఒక భార్య దగ్గర, మరో మూడు మరో భార్య దగ్గర గడపాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. మిగిలిన ఆదివారం మాత్రం.. భర్తకు ఇష్టమైన భార్య దగ్గర ఉండొచ్చు.. లేదా తనకు నచ్చిన విధంగా ఆ ఒక్క రోజు జీవించవచ్చు అంటూ వెసులుబాటు ఇస్తూ ఓ తీర్పునిచ్చింది.

Viral News: ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. భర్తను, ఆస్తిని, జీతాన్ని భార్యలకు సమానంగా పంచిన ఫ్యామిలీ కోర్టు.. ఎక్కడంటే
One Man Two Wives
Surya Kala
|

Updated on: Mar 15, 2023 | 8:48 AM

Share
కరోనా కి ముందు ఒక అమ్మాయిని.. లాక్ డౌన్ సమయంలో మరొక యువతిని ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నాడో 28 ఏళ్ల వ్యక్తి .. ఇద్దరు భార్యలకు పిల్లలున్నారు. నిజం తెలిసిన తర్వాత.. భర్త కోసం ఇద్దరు భార్యలు గొడవకు దిగారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుని, అతని సంపాదన, ఆస్తులను ఏ భార్యకు ఇబ్బంది కల్గకుండా సమానంగా పంచింది ఓ ఫ్యామిలీ కోర్టు. వారంలోని ఏడు రోజుల్లో మూడు రోజులు అంటే సోమవారం నుంచి బుధవారం వరకూ ఒక భార్య దగ్గర, గురు, శుక్ర, శనివారాలు మరో భార్య దగ్గర గడపాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. మిగిలిన ఆదివారం మాత్రం.. భర్తకు ఇష్టమైన భార్య దగ్గర ఉండొచ్చు.. లేదా తనకు నచ్చిన విధంగా ఆ ఒక్క రోజు జీవించవచ్చు అంటూ వెసులుబాటు ఇస్తూ ఓ తీర్పునిచ్చింది. ఒకవేళ అతను ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మొదటి భార్య మళ్ళీ కోర్టుకు రావచ్చు అంటూ పేర్కొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
గ్వాలియర్‌కు చెందిన ఓ యువకుడు నోయిడాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. 2018లో గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. గుర్గావ్‌లోని ఒక కంపెనీలో ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. 2020లో ఆ మహిళ గర్భవతి అయింది. అదే సమయంలో మహమ్మారి అడుగు పెట్టింది. ఓ వైపు గర్భవతి .. మరోవైపు లాక్ డౌన్ నేపథ్యంలో భర్త తన భార్యను  గ్వాలియర్‌లోని ఆమె తల్లిదండ్రుల ఇంటి వద్ద వదిలిపెట్టాడు. తన కుటుంబంతో ఉండమని భార్యను కోరాడు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేసినా సరే ఆ వ్యక్తి తన భార్యను తీసుకెళ్లకుండా తిరిగి ఉద్యోగం చేస్తున్న గుర్గావ్‌కు వెళ్లాడు.

గ్వాలియర్‌కు తిరిగి వెళ్లలేదు.. అంతేకాదు 2021లో.. తన పెనీలో పని చేస్తున్న మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో  భార్య జూలై 2021లో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే సమయంలో మొదటి భార్య తన భర్త దగ్గరకు వెళ్లాలని కోరుకుంది. అదే విషయాన్ని తన భర్త చెప్పగా.. మొదటి భార్య తన దగ్గరకు రాకుండా రకరకాల కారణాలు చెప్పడం ప్రారంభించాడు.

జనవరి 2023లో మొదటి భార్య ..తన భర్త కోసం నోయిడాకు వెళ్లింది. అప్పుడు తెలిసింది.. తన భర్త మరొక యువతిని పెళ్లి చేసుకున్నాడని.. ఆమెతో నివసిస్తున్నాడని.. వారిద్దరికీ ఓ పాప ఉందని తెలిసింది. దీంతో తన భర్తతో గొడవ పడింది. నోయిడాలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు.

అనంతరం మొదటి భార్య భరణం కోసం గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 6 నెలల పాటు వారికి కోర్టు కౌన్సెలింగ్‌ ఇచ్చింది. మంగళవారం కేసు విచారణకు ముందు రాజీకి ప్రయత్నించాలని న్యాయవాది.. కౌన్సెలర్ హరీష్ దేవాన్‌ను కోర్టు కోరింది.

ఇవి కూడా చదవండి

ఇదే విషయంపై  హరీష్ దీవాన్ మాట్లాడుతూ.. మొదటి భార్య తన బిడ్డకు భద్రతను కోరుకుంది..  తన భర్తను జైలుకు పంపాలని కోరుకోలేదు. రెండవ భార్య మొదటి భార్యతో జీవించడానికి సిద్ధంగా ఉంది,.. అయితే భర్త తన మొదటి భార్యతో జీవించడానికి ఇష్టపడలేదు. చివరకు ముగ్గురితో చర్చలు జరిపిన కౌన్సెలర్‌ హరీష్‌ దివాన్‌.. సయోధ్య కుదిర్చారు. ఈ నిర్ణయాన్ని అతడి ఇద్దరు భార్యలు అంగీకరించారు. ఈ తీర్పు తర్వాత ఆ భర్త తన నెల జీతం 1.5 లక్షలను అతని ఇద్దరు భార్యలకు పంచుతాడు. భార్యలిద్దరికీ చెరో ఫ్లాట్‌ కొనిచ్చాడు.

హిందూ వివాహ చట్టం..  IPC ప్రకారం ఇది చట్టబద్ధం కానప్పటికీ, ముగ్గురూ పరస్పర అవగాహనతో ఒప్పందంలోని నిబంధనల ప్రకారం జీవించవచ్చు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మొదటి భార్య కోర్టును ఆశ్రయించవచ్చు, ”అని దీవాన్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..