Viral Video: కదులుతున్న కారు నుంచి రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరిన ఇద్దరు యువకులు అరెస్ట్..

షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు. గురుగ్రామ్‌లోని ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని మళ్లీ రూపొందించడానికి ప్రయత్నించారు.

Viral Video: కదులుతున్న కారు నుంచి రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరిన ఇద్దరు యువకులు అరెస్ట్..
Viral Video
Follow us

|

Updated on: Mar 15, 2023 | 7:52 AM

హర్యానాలోని గురుగ్రామ్‌లో కదులుతున్న కారు నుండి కరెన్సీ నోట్లను విసిరి కెమెరాలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. కరెన్సీ నోట్లను విసిరి.. సినిమాలోని సన్నివేశాన్ని మళ్లీ రూపొందించడానికి ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.”అరెస్టయిన నిందితులను ప్రముఖ యూట్యూబర్ జోరావర్ సింగ్ కల్సి, గురుప్రీత్ సింగ్‌గా గుర్తించినట్లు ఏఎస్పీ వికాస్ కౌశిక్ తెలిపారు.నిందితులపై (ఐపీసీ)లోని పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు. గురుగ్రామ్‌లోని ఇద్దరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని మళ్లీ రూపొందించడానికి ప్రయత్నించారు. కదులుతున్న కారు ట్రంక్ నుండి కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరారు. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు తెల్లటి కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఒకరు కారు నడుపుతుండగా, మరొకరు వాహనం ట్రంక్‌లోంచి నోట్లు విసరడం.. ఆ సమయంలో మ్యూజిక్ ప్లే అవుతుండడం చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కరెన్సీ నోట్లను విసిరే యువకుడు ముఖంలో సగం గుడ్డ కప్పి ఉంది. ఇద్దరు యువకులు విసిరిన కరెన్సీ నోట్లు నకిలీవో, ​​నిజమో తెలియాల్సి ఉంది. ఈ వీడియోను ఇద్దరు వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌గా అప్‌లోడ్ చేశారు. అనంతరం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

“గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో కారులోంచి కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు సినిమాలోని సీన్‌ను రీ-క్రియేట్ చేయడానికి ప్రయత్నించిన సంఘటన గురించి సోషల్ మీడియాలో వీడియో ద్వారా పోలీసులకు తెలిసింది. పోలీసులు IPCలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..