Railway Jobs 2023: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2,587 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్షలేకుండా ఎంపిక
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2023-24 సంవత్సరానికిగానూ 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటితోపాటు నాగ్‌పుర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 772 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు, చెన్నైలోని..
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2023-24 సంవత్సరానికిగానూ 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటితోపాటు నాగ్‌పుర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 772 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు, చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి కూడా వేరువేరుగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులన్నింటికీ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 నుంచి 24 ఏళ్ల వయసు ఉండాలి.
టెన్త్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ఈ ఖాళీల భర్తీకి ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. కేవలం అకడమిక్ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అన్ని పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు ముగింపు సమయంలోపు దరఖాస్తు కోవాలి. అలాగే ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.