నిద్రపోండి.. రూ. 10 లక్షలు సంపాదించండి.. ఈ ఉద్యోగానికి అందరూ అర్హులే.. వివరాలివే.!

Sleep Internship: ఉద్యోగం ఏదైనా కూడా.. ఎంత కమిట్‌మెంట్‌తో కష్టపడి పని చేస్తే.. అంత గుర్తింపు.. జీతం పొందుతారు. అయితే పని చేసేటప్పుడు...

  • Ravi Kiran
  • Publish Date - 11:31 am, Thu, 25 February 21
నిద్రపోండి.. రూ. 10 లక్షలు సంపాదించండి.. ఈ ఉద్యోగానికి అందరూ అర్హులే.. వివరాలివే.!

Sleep Internship: ఉద్యోగం ఏదైనా కూడా.. ఎంత కమిట్‌మెంట్‌తో కష్టపడి పని చేస్తే.. అంత గుర్తింపు.. జీతం పొందుతారు. అయితే పని చేసేటప్పుడు మాత్రం కాసింత కునుకు తీసినా ఆఫీస్ యాజమాన్యం పెద్ద నేరంగా పరిగణిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా బెంగుళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే సంస్థ మాత్రం నిద్రపోతే చాలు లక్షల్లో జీతం ఇస్తానంటోంది. ప్రతీ రోజూ 9 గంటల పాటు 100 రోజులు నిద్రపోతే రూ. 10 లక్షలు మీ సొంతం. ఇదే ఆ కంపెనీ ఇస్తున్న అదిరిపోయే ఆఫర్.

బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్‌ అనే సంస్థ మ్యాట్రేస్ తయారు చేస్తుంది. వినియోగదారులకు కావాల్సిన రీతిలో పరుపులు తయారు చేసేందుకు స్లీప్ ప్యాట్రన్స్‌పై అధ్యయనం చేయడంలో భాగంగా 2019లో ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ మొదలు పెట్టింది. దీనికి ఎంపికైన వారంతా తొమ్మిది గంటలు పడుకోవాలన్నది రూల్. అలా చేస్తే రూ. 10 లక్షలు జీతం చెల్లిస్తారు.

ఈ ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’కు ఎంపికైన వారు ఎక్కువసేపు నిద్రపోయేలా స్లీప్ ఎక్స్ పర్ట్స్, న్యూట్రిషనిస్టులు, ఇంటీరియల్ డిజైన్లు, ఫిట్‌నెస్‌ నిపుణులు పలు సూచనలు చేస్తారు. ఇక 2021 ‘స్లీప్ ఇంటర్న్‌షిప్‌’ కోసం ఆ కంపెనీ దరఖాస్తులు స్వీకరణ షురూ చేసింది. తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ https://wakefit.co/sleepintern/ను సందర్శించాలని కోరింది. కంపెనీ వాళ్లు ఇచ్చిన టాస్క్‌ను విజయంతంగా పూర్తి చేస్తే రూ. 10 లక్షలు ఇవ్వనుండగా.. ఎంపికైతే లక్ష గ్యారంటీ.. సో లేట్ ఎందుకు మీరు కూడా ఓ ట్రయిల్ వేయండి..

మరిన్ని ఇక్కడ చదవండి:

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!

Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. చివరికి ఏమైందంటే.!

ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్‌ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?