AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Oxygen Shortage: దేశంలో వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. అమృత్‌సర్‌లో ఆరుగురు రోగుల మృతి

Six patients die with Oxygen shortage: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది కరోనా బాధితులు, సామాన్య రోగులు మరణిస్తున్నారు. ఈ రోజు

Medical Oxygen Shortage: దేశంలో వేధిస్తున్న ఆక్సిజన్ కొరత.. అమృత్‌సర్‌లో ఆరుగురు రోగుల మృతి
Oxygen Shortage
Shaik Madar Saheb
|

Updated on: Apr 24, 2021 | 2:18 PM

Share

Six patients die with Oxygen shortage: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరతతో చాలామంది కరోనా బాధితులు, సామాన్య రోగులు మరణిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 20 రోగులు ఆక్సిజన్ అందకపోవడంతో మరణించారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లో కూడా రోగులు మృత్యువాతపడ్డారు. ఆక్సిజన్ కొరత కారణంగా అమృత్సర్ నీల్‌కాంత్ ప్రైవేటు ఆసుపత్రిలో ఆరుగురు రోగులు శనివారం మరణించారు. ఆరుగురు రోగులల్లో ఐదుగురు కరోనాతో చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని.. సహాయం అందించాలంటూ శుక్రవారం జిల్లా యంత్రాంగాన్ని పదేపదే కోరామని అయినప్పటికీ.. రినప్పటికీ, అవసరమైన వాటిని చేయటానికి ఎవరూ ముందుకు రాలేదని.. నీల్‌కాంత్ ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ దేవగన్ ఆరోపించారు.

కాగా.. ఆక్సిజన్ కొరత కారణంగా ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు రోగులు మరణించారని సునీల్ దేవగన్ పేర్కొన్నారు. అయితే.. రోగుల మరణం తరువాత జిల్లా యంత్రాంగం కేవలం ఐదు ఆక్సిజన్ సిలిండర్లను మాత్రమే ఆసుపత్రికి సరఫరా చేసిందని దేవగన్ చెప్పారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ముగ్గురు ప్రధాన ఆక్సిజన్ సరఫరాదారులు చెప్పారని వెల్లడించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయకుండా ఉండటానికి.. ఆక్సిజన్ యూనిట్ల బయట పంజాబ్ ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించిందని దేవగన్ ఆరోపించారు.

శనివారం ఆసుపత్రిలో మరణించిన ఆరుగురు రోగులలో ఇద్దరు గురుదాస్‌పూర్‌కు చెందినవారు కాగా.. ఒకరు తరన్‌తరణ్ జిల్లా, మరో ముగ్గురు అమృత్‌సర్‌కు చెందినవారని ఆసుపత్రి యజమాన్యం వెల్లడించింది. కాగా.. దేశంలో చాలాచోట్ల ఆక్సిజన్ కొరతతో రోగులు మరణిస్తున్నారు. రెండు రోజుల్లో ఒక్క ఢిల్లీలోనే 42 మందికి పైగా కరోనా రోగులు ఆక్సిజన్ కొరత కారణంగా మరణించారు.

Also Read:

Maoist Attacks: హెచ్చరించి మరీ హతమార్చిన మావోయిస్టులు.. 2018 నుంచి ఎన్నో ఘాతుకాలు.. ఎక్కడెక్కడ అంటే..?

Covid-19 Second wave: కరోనా సెకండ్‌ వేవ్‌ ఎలాంటి విధ్వంసం సృష్టించనుంది.. అసలు నిపుణులు ఏమంటున్నారు..