Maoist Attacks: హెచ్చరించి మరీ హతమార్చిన మావోయిస్టులు.. 2018 నుంచి ఎన్నో ఘాతుకాలు.. ఎక్కడెక్కడ అంటే..?

Maoist Attacks in Chhattisgarh: దేశంలో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట దండకారణ్యం నెత్తురోడుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు

Maoist Attacks: హెచ్చరించి మరీ హతమార్చిన మావోయిస్టులు.. 2018 నుంచి ఎన్నో ఘాతుకాలు.. ఎక్కడెక్కడ అంటే..?
Maoist Attacks
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 24, 2021 | 1:51 PM

Maoist Attacks in Chhattisgarh: దేశంలో మావోయిస్టుల ఘాతుకాలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒకచోట దండకారణ్యం నెత్తురోడుతూనే ఉంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఓ ఎస్సైను హతమార్చారు. బీజాపూర్‌ జిల్లాలో ఎస్సైని మురళి తాతిని మావోయిస్టులు కాల్చి చంపారు. బుధవారం సెలవుపై ఇంటికి వెళ్లిన గంగలూరు పీఎస్‌ ఎస్ఐ మురళి తాతిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. అనంతరం శనివారం ఉదయం హతమార్చి మృతదేహాన్ని పుల్సుంపుర దగ్గర పడేసి వెళ్లిపోయారు. కాగా.. మృతదేహం వద్ద బస్తర్‌ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ లభ్యమైంది. కుటుంబ సభ్యులు ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. కాగా మురళి తాతి 2018లో జగదల్‌పూర్‌లో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన బీజాపూర్‌లో పనిచేశారు. చర్చలు జరుగుతాయనుకున్న సమయంలోనే ఇలాంటి దాడులు జరుగుతుండటంతో దండకారణ్యమంతటా ఆందోళన నెలకొంది.

అయితే.. 2018 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్యకు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడులు. ఎక్కడెక్కడ జరిగాయో ఇప్పుడు చూద్దాం.

• అక్టోబర్‌ 27, 2018 ఛత్తీస్‌గ‌ఢ్‌ బీజాపూర్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు వెళ్తున్న వాహ‌నాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ ఘటనలో న‌లుగురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందారు. • జులై 27,2020 ఛత్తీస్‌ గఢ్‌ నారాయణపూర్ లోని దూల్ ఛత్తీస్‌గడ్ ఆర్మడ్ ఫోర్స్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో జవాను మృతి చెందాడు. • సెప్టెంబర్‌ 5,2020 బీజాపూర్ జిల్లాలోని మోటాపోల్, పునాసార్ గ్రామాలకు చెందిన 25 మంది గిరిజనులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. వారిలో నలుగురిని గొంతుకోసి హతమార్చారు. • అక్టోబర్‌ 25,2020 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో నాయకులపు ఈశ్వర్ అనే హోంగార్డును మావోయిస్టులు కొట్టి చంపారు. • అక్టోబర్‌ 1,2020 ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఇన్‌ఫార్మర్ల నెపంతో కుర్చేలి గ్రామానికి చెందిన 16 మంది వ్య‌క్తుల‌ను మావోయిస్టులు హతమార్చారు. • అక్టోబర్‌11,2020 ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత భీమేశ్వరరావు ( బీసు) ను మావోయిస్టులు చంపారు. • డిసెంబర్‌ 17,2020 ఆంధ్ర-ఒడిశా సరిహద్దు మల్కన్​గిరి జిల్లా మతిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంగ్రిగూడా గ్రామంలో రహదారి పనులు నిర్వహిస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను మావోయిస్టులు హతమార్చారు. • ఏప్రిల్‌ 5,2021 చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో విజయనగరం జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాను రౌతు జగదీష్‌ మృతి. • మార్చి 23,2021 ఛత్తీస్‌ గఢ్‌ నారాయాణపూర్‌ జిల్లాలో డీఆర్‌జీ సిబ్బందితో వెళుతున్న బస్సును పేల్చివేసిన మావోయిస్టులు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. • ఏప్రిల్‌ 4, 2021 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందారు. • ఏప్రిల్‌ 16, 2021 సుక్మా జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లను కత్తితో పీక కోసి మావోయిస్టులు హత్యచేశారు. • ఏప్రిల్‌ 17, 2021 ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల్లో సూపర్‌ వైజర్‌ను కొట్టి దారుణంగా చంపారు. ముగ్గురిని కిడ్నాప్‌ చేసిన మావోయిస్టులు ఒకరిని హతమార్చారు. • ఏప్రిల్‌ 19, 2021 ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు యువకులను మావోయిస్టులు హత్య చేశారు. • ఏప్రిల్‌ 24, 2021 బీజాపూర్‌ జిల్లా లో ఎస్సై మురళిని మావోయిస్టులు హతమార్చారు.

Also Read:

Medical Oxygen Shortage: ఢిల్లీలో దారుణం.. ఆక్సిజన్ కొరతతో మరో 20 మంది బలి.. మరికొంత మంది పరిస్థితి విషమం

SI murdered by maoists: నెత్తురోడుతున్న దండకారణ్యం.. కిడ్నాప్ చేసిన ఎస్ఐను హత్య చేసిన మావోయిస్టులు

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..