SI murdered by maoists: నెత్తురోడుతున్న దండకారణ్యం.. కిడ్నాప్ చేసిన ఎస్ఐను హత్య చేసిన మావోయిస్టులు
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల కాలంలో 22 మందికి పైగా పోలీసులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల కాలంలో 22 మందికి పైగా పోలీసులను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో పోలీసును దారుణంగా చంపారు. బీజాపూర్ జిల్లాలోని జగదల్పూర్ సబ్ ఇన్‌స్పెక్టర్ మురళి తాతిని మావోయిస్టులు కాల్చి చంపారు. అనంతరం ఆయన మృతదేహాన్ని మంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్సుమ్‌పారా వద్ద పడేసి వెళ్లిపోయారు. గంగలూర్‌లో ఎస్ఐగా పని చేస్తున్న మురళి సెలవుల కోసం ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో బీజాపూర్ జిల్లాలోని తన గ్రామం పల్నూర్ గ్రిహగ్రామ్ నుంచి గత బుధవారం మాయిస్టులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు ఆయన విడుదల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు.
కాగా.. మృతదేహం వద్ద బస్తర్ కమిటీ పేరుతో మావోయిస్టుల లేఖ లభ్యమైంది. మురళి తాతి హత్యను ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధ్రువీకరించారు. ఇటీవల కాలంలో ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు వరుస దాడులు చేస్తున్నారు. పోలీసులతోపాటు సాధారణ ప్రజలను సైతం పొట్టనబెట్టుకుంటున్నారు. చర్చలు జరుగుతాయనుకున్న సమయంలోనే ఇలాంటి దాడులు జరుగుతుండటంతో దండకారణ్యమంతటా ఆందోళన నెలకొంది. కాగా మురళి తాతి 2018లో జగదల్‌పూర్‌లో జాయిన్ అయ్యారు. అంతకుముందు ఆయన బీజాపూర్‌లో పనిచేశారు.
Also Read: