Covid-19 Second wave: కరోనా సెకండ్ వేవ్ ఎలాంటి విధ్వంసం సృష్టించనుంది.. అసలు నిపుణులు ఏమంటున్నారు..
coronavirus second wave in india: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుదున్నాయి. వేలాది మరణిస్తున్నారు. దీంతో దేశమంతటా విపత్కర పరిస్థితులు
coronavirus second wave in india: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుదున్నాయి. వేలాది మరణిస్తున్నారు. దీంతో దేశమంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. మేలో కరోనా ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని కాన్పూర్, హైదరాబాద్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ తరుణంలో చాలామందికి ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రోజువారీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు వాస్తవమేనా? మే రెండో వారం నుంచి వాస్తవ లెక్కలు బయటకు వస్తాయా.? అప్పటికి రోజుకు 10 లక్షల కేసులు బయటపడే అవకాశం ఉందా.? వైద్య నిపుణులు కొంతమంది చెబుతున్న మాటలలో వాస్తవమెంత? ఎప్పటివరకూ ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతుందని అనేదానిపై మిషిగన్ విశ్వవిద్యాలయం అంటు వ్యాధుల విభాగం ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ మాట్లాడారు. మే రెండోవారానికి భారత్‌లో కరోనా విజృంభణ గరిష్ఠ స్థాయికి చేరుతుదంని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. అయితే.. ప్రొఫెసర్ ముఖర్జీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ నమూనా సాయంతో ఈ విశ్లేషణను వెల్లడించారు. మే మధ్యనాటికి రోజువారీ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరవచ్చని తెలిపారు. దీంతోపాటు రోజువారీ మరణాల సంఖ్య 5 వేలకు చేరుకోవచ్చని అంచనా వేశారు. మే మధ్యనాటికి మొత్తం ఇన్‌ఫెక్షన్ల సంఖ్య గరిష్ఠ స్థాయిలో 45 లక్షలకు చేరుకునే అవకాశముందన్నారు. పరిస్థితులు మరింత దిగజారితే రోజూవారి కేసుల సంఖ్య 50 లక్షలకు కూడా చేరే ప్రమాదముందని హెచ్చరించారు.
భారత్‌లో ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసులు మాత్రమే వస్తున్నాయని.. కానీ వాస్తవ పరిస్థితులు అంతకంటే దారుణంగా ఉన్నాయని భ్రమర్ ముఖర్జీ అనుమానం వ్యక్తం చేశఆరు. మరణాలు తగ్గడానికి, మళ్లీ సాధారణ జీవిత పరిస్థితులు నెలకొనడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అగస్టు నాటికి ఈ ఉద్ధృతి తగ్గుముఖం పట్టే అవకాశముందన్నారు. అయితే కరోనా కట్టడికి కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం, భారీ సమూహాలను నిషేదించడం, మాస్క్‌లు తప్పనిసరిగా చేయడ, వ్యాక్సినేషన్‌ను భారీగా పెంచడం ద్వారా కేసుల సంఖ్యను తగ్గించవచ్చని సూచనలు చేశారు. అయితే.. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా భారీగా పెంచాలని సూచించారు. అయితే భారత్ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. అంతర్జాతీయ సమాజ సహకారం అవసరం అనిపిస్తుందని భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు.
అయితే.. 2020 అక్టోబరులోనే భారత్‌లో కరోనా రెండో దశకు చేరకుందని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు మరో పీక్‌స్టేజ్ ఉంటుందని చెబుతున్నాయని.. అది ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పడం కష్టమని తెలిపారు. ఇప్పుడు చేయాల్సిందల్లా.. నియమాలు పాటించడమేనని.. యాంటీబాడీ సర్వేలు ఎక్కువగా నిర్వహించడం మేలని భ్రమర్ ముఖర్జీ సూచించారు.
Also Read: