AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shirdi Temple: హమ్మయ్య.. ఎట్టకేలకు ముగిసిన షిర్డీ సెక్యూరిటీ సమస్య.. 74 మంది జవాన్లతో అదనపు భద్రత..

షిర్డీ ఆలయ సెక్యూరిటీకి సంబంధించిన వివాదం ముగిసింది. కేంద్ర సీఐఎస్ఎఫ్‌ భద్రతపై స్థానికులు కొన్నాళ్లుగా అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఓ మంత్రి చర్చలతో ఇష్యూకి ఫుల్‌స్టాప్‌ పడింది. షిర్డీ ఆలయంలో మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్‌ రంగంలోకి దిగింది.

Shirdi Temple: హమ్మయ్య.. ఎట్టకేలకు ముగిసిన షిర్డీ సెక్యూరిటీ సమస్య.. 74 మంది జవాన్లతో అదనపు భద్రత..
Shiridi Sai
Shiva Prajapati
|

Updated on: Jul 02, 2023 | 5:59 AM

Share

షిర్డీ ఆలయ సెక్యూరిటీకి సంబంధించిన వివాదం ముగిసింది. కేంద్ర సీఐఎస్ఎఫ్‌ భద్రతపై స్థానికులు కొన్నాళ్లుగా అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఓ మంత్రి చర్చలతో ఇష్యూకి ఫుల్‌స్టాప్‌ పడింది. షిర్డీ ఆలయంలో మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్‌ రంగంలోకి దిగింది.

మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను కల్పించింది. భద్రత కోసం 74 మంది ఎంఎస్ఎఫ్ జవాన్లు మోహరించారు. ముంబై హైకోర్టు అనుమతితో ఆలయ గభారా, ఐదు ప్రవేశ ద్వారాల వద్ద ఆర్మీ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించనున్నారు. వీరికి తోడుగా 100 మంది పోలీసులు ఆలయ క్యూ కాంప్లెక్స్, చెకింగ్ పాయింట్, ఆలయ పరిసరాల్లో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తారు. అలాగే, షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ సొంతగా మరో 600 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీని నియమించుకుంది. వీరంతా కాంప్లెక్స్, ప్రసాదాలయం, భక్తి నివాస్ సహా ఆయా ప్రాంతాల్లో భద్రతాపరమైన విధులు నిర్వహిస్తారు.

షిర్డీలో సీఐఎస్ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలని కేంద్రం గతంలో నిర్ణయించింది. అయితే, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని షిర్డీ సంస్థాన్ స్వాగతించగా.. స్థానికులు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. గతంలో మే 1న స్థానికులు బంద్‌కు పిలుపునిచ్చారు. తమకు సీఐఎస్ఎఫ్ భద్రత అవసరంలేదంటూ ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. అయితే.. స్థానిక మంత్రి చొరవతో ఆ వివాదానికి ముగింపు పలికారు. ఈ క్రమంలోనే.. తాజాగా.. మహారాష్ట్ర సెక్యూరిటీ ఫోర్స్ భద్రతను కల్పించారు. ఈ జవాన్లను సాయి దేవాలయంలోని అన్ని ప్రవేశాల వద్ద, సాయి ఆలయం లోపల, దర్శన క్యూ, భక్తుల తనిఖీతోపాటు మొత్తం ఆలయ ప్రాంగణంలో మోహరిస్తారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తారు. ఈ 74 మంది కోసం షిర్డీ ట్రస్ట్ నెలకు 21 లక్షల ఖర్చు భరించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న షిర్డీ ఆలయానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున వస్తుంటారు. సాయి భక్తులకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఎంతో మంది భక్తులు ఉన్నారు. సాయిబాబా సమాధి అయి వందల ఏళ్లు గడిచినా.. కోరికలు తీరుస్తున్నారని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తుంటారు భక్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..