Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wednesday Remedies: గణపతి పూజలో ఇవి తప్పక పెట్టండి.. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి..!

హిందూమత ఆచారాల ప్రకారం.. బుధవారం నాడు గణపతి దేవుడిని ప్రార్థిస్తారు. బుధవారం నాడు పూర్తి ఆచారసంప్రదాయాలతో గణపతికి పూజలు చేస్తే.. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని విశ్వాసం. గణనాథుడిని ఈవేళ సరైన రీతిలో పూజిస్తే సమస్యలన్నీ సమసిపోయి జీవితంలో

Wednesday Remedies: గణపతి పూజలో ఇవి తప్పక పెట్టండి.. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి..!
Lord Ganesha Puja
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 28, 2023 | 11:23 AM

హిందూమత ఆచారాల ప్రకారం.. బుధవారం నాడు గణపతి దేవుడిని ప్రార్థిస్తారు. బుధవారం నాడు పూర్తి ఆచారసంప్రదాయాలతో గణపతికి పూజలు చేస్తే.. జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని విశ్వాసం. గణనాథుడిని ఈవేళ సరైన రీతిలో పూజిస్తే సమస్యలన్నీ సమసిపోయి జీవితంలో ఆనందాన్ని కలుగుతుందని ప్రజల నమ్మకం. ఆదిదేవుడిగా పూజలు అందుకున్న గణపయ్యను బుధవారం పూచించడం వలన జాతకంలో బలహీన స్థితిలో బుధ గ్రహ శక్తి బలపడుతుంది. అయితే, గజాననుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. పూజను పరిపూర్ణంగా చేయాలి. తద్వారా విఘ్నేశ్వరుడిని అనుగ్రహం లభిస్తుంది. గణపతికి పూజలో కొన్ని రకాల నైవేధ్యాలు, పదార్థాలు పెట్టాలి. మరి అవేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

1. గణనాథుడికి దుర్వా గడ్డి(గరిక పోచలు) అంటే చాలా ఇష్టం. అందుకే పూజ సమయంలో దేవుడి ముందు దీనిని తప్పనిసరిగా పెట్టాలి. తద్వారా గణేషుడు సంతోషించి ఆశీస్సులు అందిస్తాడు.

2. పూజలో భాగంగా గణనాథుడికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుస్తాడని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

3. అరటిపండు వినాయకుడికి ఇష్టమైన పండుగా పేర్కొంటారు. అందుకే గణేశుడికి పూజ సమయంలో అరటిపండును తప్పనిసరిగా పెట్టాలి. ఏదైనా పనిలో విజయం సాధించాలంటే గణేషుడికి అరటిపండును నైవేద్యంగా పెట్టొచ్చు. తద్వారా స్వామి ఆశీస్సులు లభిస్తాయి.

3. పసుపు లేకుండా గణపతి పూజ చేయడం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. గణేషుడి పూజలో పసుపు తప్పనిసరిగా ఉండాలి. గజాననుడికి ముందు పసుపును తప్పనిసరిగా ఉంచాలి. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది.

4. వియానకుడి పూజలో తమలపాకును తప్పనిసరిగా ఉండాలి. పూజలో తలమపాకు పెట్టడం ద్వారా ఆ భగవంతుడి దీవెనలు లభిస్తుంది.

5. గణపతి పూజలో సిందూరం కూడా చాలా కీలకం. గణనానుథుడి ఆశీస్సులు పొందడానికి పూజలో సిందూరం ఉండాల్సిందే.

6. గణపతికి పూలు తప్పనిసరిగా సమర్పించాలి. ముఖ్యంగా ఎరుపు రంగు పువ్వులు గణేషుడికి చాలా ఇష్టం. అందుకే అలాంటి పువ్వులను పూజలో ఏర్పాటు చేయాలి. తద్వారా గణపతి ఆశీస్సులు పొందుతారు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం హిందూమత గ్రంథాలు, వేదపండితులు తెలిపిన వివరాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..