Watch Video: వందే భారత్ ట్రైన్‌ను లాక్కేళ్తున్న రైలింజన్.. కేంద్రంపై నెటిజన్లు విమర్శలు..
వందే భారత్ ట్రైన్‌ను పాత రైల్ ఇంజిన్ లాక్కెళ్లుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కానీ.. రైల్వే శాఖ వివరణతో అసలు విషయం బయటపడింది.

వందే భారత్ ట్రైన్‌ను పాత రైల్ ఇంజిన్ లాక్కెళ్లుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను చూపిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ పార్టీల నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కానీ.. రైల్వే శాఖ వివరణతో అసలు విషయం బయటపడింది.
దేశంలోని మొదటి సెమీ హై స్పీడ్ రైలు వందే భారత్. దీనిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అత్యాధునిక సదుపాయాలతో ఈ రైళ్లను తయారు చేశారు. ప్రస్తుతం దేశంలో 23 వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే వందేభారత్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. వీటిపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసిన సందర్భాలు అనేకం. అయితే, తాజాగా మరోసారి వందే భారత్ ట్రైన్ చర్చనీయాంశమైంది. దానికి కారణం ఓ వీడియో వైరల్ అవ్వటమే. అవును, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఓ ఇంజిన్ లాక్కెళ్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఇదే అంశంపై ఇప్పుడు హాట్ డిస్కర్షన్ నడుస్తోంది. వందే భారత్ మొరాయించడంతో పాత రైలు ఇంజిన్‌తో తీసుకెళ్తున్నారని, ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన వందేభారత్ రైళ్ల పరిస్థితి ఇదీ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.




కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. ‘తొమ్మిదేళ్ల అబద్ధాలను 70 ఏళ్ల చరిత్ర లాక్కెళ్తోంది’ అంటూ సెటైరికల్ క్యాప్షన్ పెట్టారు. దీనికి మిగతా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. హైస్పీడ్ రైళ్లంటూ ఊదరగొట్టి, చివరకు కాంగ్రెస్ తెచ్చిన ఇంజిన్లే దిక్కయ్యాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలాఉంటే.. సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న ఈ వ్యవహారంపై, విమర్శలపై రైల్వే శాఖ స్పందించింది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పందిస్తూ… ఇది ప్రారంభం కాని వందే భారత్ రైలు అని క్లారిటీ ఇచ్చింది. రూట్ కూడా ఖరారు కాలేదని చెప్పుకొచ్చింది. ఒకసారి రూట్ ఖరారైతేనే లోకో పైలట్లు, సిబ్బంది అందుబాటులోకి వస్తారని క్లారిటీ ఇచ్చారు.
కాగా, ఈ వీడియోను యూపీకి చెందిన శశాంక్ అనే వ్యక్తి సకల్ దిహా రైల్వే స్టేషన్ సమీపంలో చిత్రీకరించాడు. వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. చెన్నై ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ నుండి పాట్నా తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే ప్రారంభం కాని వందే భారత్ ట్రైన్‌ను మరో ట్రైన్ ఇంజిన్ లాక్కెళ్తుండటాన్ని మరోవిధంగా అర్థం చేసుకున్నవారు విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అందులో ప్రయాణికులు, సిబ్బంది లేరని పేర్కొన్నప్పటికీ.. కేవలం వీడియోను మాత్రమే డౌన్‌లోడ్ చేసి కొందరు కామెంట్స్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.
पीछले 9 सालों के झूठ को खींच कर ले जाता 70 सालों का इतिहास👇 pic.twitter.com/WwdCIj7cQL
— Krishna Allavaru (@Allavaru) June 29, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
