తమిళనాడు సీఎం పళనిస్వామిని పరామర్శించిన రోజా
తమిళనాడు సీఎం పళనిస్వామిని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే
RK Roja Palaniswami: తమిళనాడు సీఎం పళనిస్వామిని వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా పరామర్శించారు. పళనిస్వామి తల్లి తవసాయమ్మ గతవారం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భర్త ఆర్కే సెల్వమణితో కలసి రోజా మంగళవారం గ్రీన్‌వేస్ రోడ్డులోని పళని స్వామి ఇంటికి వెళ్లారు. తవసాయమ్మ చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించి, పళనిస్వామితో మాట్లాడి ఈ ఇద్దరు తమ సానుభూతిని తెలిపారు. కాగా ఎండీఎంకే నేత వైగో, సీపీఐ నేత ముత్తరసన్, బీజేపీ నేత కుష్బూ, డీఎండీకే నేత సుదీప్, సినీ నిర్మాత ఆర్‌బీ చౌదరి కూడా మంగళవారం పళనిస్వామిని పరామర్శించారు.
Read More:
సుడిగాలి సుధీర్‌కి కరోనా పాజిటివ్..!