Indian Railways: కరోనా ఎఫెక్ట్.. దూరంతో, రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సహా 28 రైళ్లు రద్దు.. ఎప్పటివరకంటే..?
Central Railway: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షల కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు
Central Railway: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షల కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పలుచోట్ల కర్ఫ్యూ, లాక్‌డౌన్ విధిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ.. కేసుల ఉదృతి నియంత్రణలోకి రావడం లేదు. దీంతో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్లు చూపించాలంటూ పలు రాష్ట్రాలు ప్రయాణికులను కోరుతున్నాయి. ఆ సర్టిఫికెట్ ఉంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తామంటూ పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో భారత రైల్వే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొన్ని రైళ్లను పొడిగిస్తూ, మరికొన్ని రైళ్లను రద్దు చేస్తూ వస్తోంది. ఆక్యుపెన్సీ లేకపోవడంతో ఇప్పటికే పలు రైళ్ల సర్వీసులను రైల్వేశాఖ రద్దు చేసింది. తాజాగా దురంతో, రాజధాని, శతాబ్ది, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ సంబంధిత రైళ్లు ఈ నెల 9 నుంచి అందుబాటులో ఉండవని పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ రైళ్లు నడవవని నార్త్ రైల్వేశాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించింది. కాగా గురువారం దక్షిణ మధ్య రైల్వే కూడా 28 రైళ్లను రద్దు చేసింది. ఈ వివరాలన్ని కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
Also Read: