YS Jagan: ప్రధాని మోదీకి సపోర్ట్‌గా జగన్ ట్వీట్.. జార్ఖండ్ సీఎంకు కౌంటర్.. అసలేం జరిగిందంటే..?

YS Jagan on hemant soren: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత, పలు చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల

YS Jagan: ప్రధాని మోదీకి సపోర్ట్‌గా జగన్ ట్వీట్.. జార్ఖండ్ సీఎంకు కౌంటర్.. అసలేం జరిగిందంటే..?
YS Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2021 | 4:49 PM

YS Jagan on hemant soren: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొరత, పలు చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పలు వ్యాఖ్యలు చేస్తూ.. ట్విట్ చేశారు. అయితే.. హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉందామంటూ ట్విట్టర్ వేదికగా జగన్ సూచించారు. కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని హితవు పలికారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు. సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని, కరోనా సమయంలో రాజకీయాలు తగవని జగన్ అభిప్రాయపడ్డారు.

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా.. పలు రాష్ట్రాల పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్, పలు రాష్ట్రాల సీఎంలకు కూడా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత సీఎం సోరెన్ ట్వీట్ చేశారు. ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారని.. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది. మా మాట కూడా వింటే బాగుండేది.. అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

అయితే.. హేమంత్ సొరేన్ ట్వీట్ కు బదులిచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్.. విభేదాలు ఉన్నా ఇలాంటి రాజకీయ విమర్శలు మన జాతీయత ను బలహీనపరుస్తాయంటూ ఆయన ట్విట్ చేశారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి ట్విట్‌కు హేమంత్ సోరెన్ ఏ విధంగా బదులిస్తారో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:

కొత్తగా వచ్చిన N440K కొవిడ్ వైరస్ అంటే ఏమిటీ..! ఏపీలో ఎక్కువగా వ్యాప్తి..? సీసీఎంబీ ఏం చెబుతోంది..

Randeep Guleria: ఆక్సిజన్ స్థాయి అంతఉంటే.. క్రిటికల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు.. గులేరియా