Randeep Guleria: ఆక్సిజన్ స్థాయి అంతఉంటే.. క్రిటికల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు.. గులేరియా

Oxygen Saturation: కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో

Randeep Guleria: ఆక్సిజన్ స్థాయి అంతఉంటే.. క్రిటికల్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు.. గులేరియా
Dr Randeep Guleria
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 07, 2021 | 4:18 PM

Oxygen Saturation: కరోనావైరస్ మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా అధికమవుతోంది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరతతో చాలామంది కరోనా బాధితులు మరణిస్తున్నారు. అయితే చాలామంది ఆక్సిజన్ లేదన్న భయంతో ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. కాగా.. కరోనా రోగులలో ఆక్సిజన్ స్థాయి 92 లేదా 93 ఉంటే.. దానిని క్లిష్టమైనదిగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. అయితే రోగి పరిస్థితిని అంచనా వేసి.. ఆసుపత్రికి తరలించడానికి ఆక్సిజన్‌ను వినియోగిస్తే సరిపోతుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆక్సిజన్ గురించి పలు సలహాలు సూచనలు ఇస్తూ.. గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. శరీరంలో ఆక్సిజన్‌ లెవల్ 90 శాతం పైన ఉన్నప్పుడు.. గంట ఉపయోగించి పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు.

కరోనా రోగులందరికీ… ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు. ఆక్సిజన్ స్థాయి 90 శాతానికన్నా తగ్గినప్పుడే మెడికల్ ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అయితే ఆక్సిజన్ కొరత కారణంగా.. ప్రతిచోట ఆక్సిజన్ సిలిండర్ల దుర్వినియోగం జరుగుతోంది. ఈ క్రమంలో చాలామంది వ్యక్తులు ఆక్సిజన్ సిలిండర్లను ఇంట్లో నిల్వ చేయడంతోపాటు.. బ్లాక్‌లో అమ్ముకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో ప్రతి కరోనా రోగికి ఆక్సిజన్ కావాల్సి వస్తుందన్న అపోహతో.. ఇలా చేస్తున్నారు. ఇది మంచిది కాదంటూ గులేరియా అభిప్రాయపడ్డారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. శరీరంలో తగినంత ఆక్సిజన్ ఉందని అర్దం చేసుకోవాలని.. భయపడవద్దని సూచించారు. సాధారణ స్థాయి ఆక్సిజన్ ఉన్న వ్యక్తులకు ఆక్సిజన్ ఇవ్వడం వల్ల.. అత్యవసరమైన రోగులకు అందడంలేదంటూ అభిప్రాయపడ్డారు. ఆక్సిజన్ లెవల్స్.. 80 నుంచి 90 శాతం మధ్య ఉన్న రోగులకు ఆక్సిజన్ అందడం లేదని పేర్కొన్నారు. 90శాతం పైన ఆక్సిజన్ లెవల్స్ ఉన్న వారికి మెడికల్ ఆక్సిజన్ అత్యవసరం కాదని పేర్కొన్నారు.

Also Read:

India Coronavirus: భారత్‌లో కొత్తగా 4 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు..రికార్డు స్థాయిలో మరణాలు..!

Nayanthara: ఓటీటీ లో రానున్న లేడీ సూపర్ స్టార్ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు నయన్ ‘నిజల్’