AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Acid Attack: రూ.300 ఇవ్వలేదనీ.. కని పెంచిన తల్లిపైనే యాసిడ్‌ దాడి చేసిన కసాయి కొడుకు..!

తల్లిని మందుకొట్టి డబ్బులు అడిగాడు. కొడుకును అడవికి వెళ్లనివ్వడం తల్లికి ఇష్టంలేదు. ఆ కోపంతో తల్లిపై యాసిడ్ పోసి చంపేందుకు కొడుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటన నగరంలోని రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారువా..

Acid Attack: రూ.300 ఇవ్వలేదనీ.. కని పెంచిన తల్లిపైనే యాసిడ్‌ దాడి చేసిన కసాయి కొడుకు..!
Acid Attack
Srilakshmi C
|

Updated on: Sep 05, 2023 | 8:37 PM

Share

రాయ్‌గంజ్, సెప్టెంబర్ 4: తల్లిని మందుకొట్టి డబ్బులు అడిగాడు. కొడుకును అడవికి వెళ్లనివ్వడం తల్లికి ఇష్టంలేదు. ఆ కోపంతో తల్లిపై యాసిడ్ పోసి చంపేందుకు కొడుకు ప్రయత్నించాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటన నగరంలోని రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బారువా గ్రామ పంచాయతీ గోల్‌పరా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గాయపడిన మహిళ బైజయంతి సర్కార్ (40)గా గుర్తించారు. నార్త్ దినాజ్‌పూర్‌లోని రాయ్‌గంజ్‌కు చెందిన బైజయంతి పూసల తయారు చేసే కార్మికురాలు. సోమవారం ఉదయం ఆమె కొడుకు దూలు సర్కార్ (19) మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న దూలు సర్కార్‌ తల్లిని 300 రూపాయలు అడిగాడు. అడిగిన డబ్బు తల్లి ఇవ్వకపోవడంతో యాసిడ్ బాటిల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరుగు పొరుగు మహిళను రక్షించి రాయ్‌గంజ్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చేర్చారు. యాసిడ్ ధాటికి బాధితురాలి రెండు చేతులు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన అనంతరం నిందిత బాలుడు పరారయ్యాడు. మద్యం మత్తులో ఉన్న తన కొడుకు డబ్బులు ఇవ్వలేదని తనపై యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడని బైజయంతి పోలీసులకు తెలిపింది.

అడిగినంత డబ్బు ఇవ్వకుంటే తన కొడుకుతో పాటు భర్త కూడా తరచూ కొట్టేవారని స్థానికులు తెలిపారు. దీనిపై రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్‌ అయ్యింది. గాయపడిన మహిళ తండ్రి ధీరేంద్రనాథ్ సర్కార్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాలుడిని కఠినంగా శిక్షించాలని ఇరుగుపొరుగు వారు డిమాండ్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.