Rahul Gandhi: మోడీ-అదానీ బంధాన్ని ప్రశ్నించినందుకే కుట్రపన్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

అనర్హత పరిణామాల అనంతరం రాహుల్‌ గాంధీ.. తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదంటూ స్పష్టంచేశారు.

Rahul Gandhi: మోడీ-అదానీ బంధాన్ని ప్రశ్నించినందుకే కుట్రపన్నారు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi
Follow us

|

Updated on: Mar 25, 2023 | 1:43 PM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మోడీ ఇంటిపేరుతో చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్ సభ సచివాలయం రాహుల్ పై చర్యలు తీసుకుంది. కాగా, కేంద్రం తీరుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అనర్హత పరిణామాల అనంతరం రాహుల్‌ గాంధీ.. తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రలకు భయపడేది లేదంటూ స్పష్టంచేశారు. మోడీ-ఆదానీ సంబంధం బయటపడాలన్నారు. వారిద్దరి మధ్య సంబంధం గురించి వెలుగురావాలని డిమాండ్ చేశారు. తాను ఎవరికీ భయపడనని.. అన్ని సాక్ష్యాలు పార్లమెంటుకు సమర్పించానని తెలిపారు. అప్పటినుంచే తనపై కుట్రపన్నారంటూ ఆరోపించారు. దీనిపై రెండు లేఖలు స్పీకర్ కు రాశానని.. దీనిపై పట్టించుకోవడం లేదని తెలిపారు. కోట్లాది రూపాయలు ఎవరివీ అంటూ ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఓ చైనీయుడు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడని తెలిపారు. ప్రతిపక్షాలకు మీడియా మద్దతు దొరకడం లేదని.. అంతా మద్దతునివ్వాలని కోరారు. రక్షణ ప్రాజెక్టులన్నీ అదానీకే ఎందుకిచ్చారన్నారు. నిబంధనలు మార్చి ఎయిర్ పోర్టులు అదానీకి ఎందుకిచ్చారంటూ ప్రశ్నించారు. అదానీ షెల్ కంపెనీలకు 20వేల కోట్లు ఎలావచ్చాయంటూ ప్రశ్నించారు.

అదానీ, మోడీ సంబంధంపై మాట్లాడని.. అన్ని ఆధారాలను సమర్పించానని తెలిపారు. ప్రధానిని కాపాడేందుకు ఇదంతా చేస్తుందన్నారు. దీని గురించి పోరాడేందుకు ప్రజల్లోకి వెళ్తానని తెలిపారు. జైలు, అనర్హత వీటి గురించి భయపడనని.. విపక్షాలన్నీ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. లండన్ లో దేశానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని స్పష్టంచేశారు. తాను నిజమే మాట్లాడతానని.. ఈ దేశం కావాల్సింది ఇచ్చిందని తెలిపారు. ప్రేమ, గౌరవం ఇచ్చిందని పేర్కొన్నారు. అనర్హత వేటు వేసినా..? జైల్లో పెట్టినా తాను భయపడనని స్పష్టంచేశారు.

అవినీతి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉంటానని.. రాహుల్ పేర్కొన్నారు. తనకు మద్దతునిచ్చిన విపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినా తన పోరాటం ఆగదని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..