PM Modi – US Joe Biden: బిడెన్‌తో వర్చువల్ సమావేశం.. కీలక అంశాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ..!

PM Modi - US Joe Biden: బిడెన్‌తో వర్చువల్ సమావేశం.. కీలక అంశాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ..!
Modi

PM Modi - US Joe Biden: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ సంక్షోభం సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ

Shiva Prajapati

|

Apr 12, 2022 | 5:56 AM

PM Modi – US Joe Biden: ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ సంక్షోభం సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యతన సంతరించుకున్న ఇరుదేశాధినేత భేటీలో భారత్‌-అమెరికా ద్వైపాక్షిక అంశాలపైనా చర్చ జరిగింది. చర్చలో భాగంగా.. భారత్‌-అమెరికా లక్ష్యాల్లో సారూప్యత ఉందని బైడెన్‌ తెలిపారు. రక్షణ రంగంలో భారత్‌తో బలమైన బంధం ఉందని పేర్కొన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో మారణకాండను ఖండిస్తున్నట్టు వెల‍్లడించారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని జెలెన్‌ స్కీ, పుతిన్‌ను కోరినట్టు తెలిపారు. యుద్ధ భూమి నుంచి భారతీయులను సురక్షితంగా తరలించామని ఆయన చెప్పారు. ఉక్రెయిన్‌ అంశం గురించి భారత పార్లమెంట్‌లోనూ చర్చించామన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జెలెన్‌స్కీ, పుతిన్‌తో మాట్లాడి సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. ఉక్రెయిన్‌-రష్యా వివాదం త‍్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలోని పది ముఖ్యమైన అంశాలను చూద్దాం..

1. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని బుచాలో జరిగిన పౌర హత్యలను భారత్ ఖండించింది. భారతదేశం కూడా స్వతంత్ర, న్యాయ విచారణను కోరింది. 2. ఉక్రెయిన్‌కు భారతదేశం పంపిన మానవతా సహాయాన్ని అధ్యక్షుడు బిడెన్ ప్రశంసించారు. ఉక్రెయిన్, దాని పొరుగు దేశాలకు భారతదేశం 90 టన్నులకు పైగా మానవతా సహాయ సామగ్రిని అందించింది. 18 దేశాలకు చెందిన దాదాపు 150 మంది విదేశీ పౌరులను తరలించడానికి భారత్ సహకారం అందించడంపట్ల అభినందనలు తెలిపారు. 3. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య ప్రత్యక్ష చర్చల ఆవశ్యకతను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. 4. అభివృద్ధి సహకారం, కరోనా మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ చర్యలు, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు, ఇండో-పసిఫిక్‌లో చట్టబద్ధమైన పాలనపై సమన్వయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం, క్వాడ్ భాగస్వాములతో కలిసి పని చేస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. 5. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మనం సహజ భాగస్వాములమని, గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా సంబంధాలలో సాధించిన పురోగతి కొత్త ఊపందుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 6. ప్రధాని మోదీ అధ్యక్షుడు బిడెన్‌తో మాట్లాడుతూ.. ‘మీ పదవీకాలం ప్రారంభంలో చాలా ముఖ్యమైన నినాదం ఇచ్చారు, ‘‘ప్రజాస్వామ్యం అందించగలదు’’. ఈ నినాదాన్ని అర్థవంతంగా మార్చేందుకు భారత్-అమెరికా భాగస్వామ్యం విజయవంతమైంది. 7. అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరు దేశాల నేతలు లోతైన చర్చలు జరిపారు. కోవిడ్-19 మహమ్మారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వాతావరణ చర్య, దక్షిణాసియా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇటీవలి పరిణామాలు, ఉక్రెయిన్‌లో పరిస్థితి వంటి అంశాలు ఈ చర్చల్లో ఉన్నాయి. 8. ఇటీవలి సంవత్సరాలలో ద్వైపాక్షిక సంబంధాలలో సాధించిన గణనీయమైన పురోగతిని కూడా మోడీ, బిడెన్ సమీక్షించారు. భారత్-అమెరికా సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం వల్ల ఇరు దేశాలకు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, స్థిరత్వానికి కూడా దోహదపడుతుందని ఇరువురు నేతలు అంగీకరించారు. 9. భారతదేశం, అమెరికాలను రెండు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా అభివర్ణించిన బిడెన్ ‘‘కోవిడ్ 19 సంక్షోభాన్ని పోలిన అనేక సవాళ్లు మన ముందుు ఉన్నాయి. ఆరోగ్య భద్రతను మెరుగుపరచాలి, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించాలి.’’ అని అన్నారు. తమకు బలమైన, అభివృద్ధి చెందుతున్న రక్షణ భాగస్వామ్యం ఉందిన బిడెన్ పేర్కొన్నారు. 10. మే 24న జపాన్‌లో జరగనున్న క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీని కలవాలని ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బిడెన్ తెలిపారు.

Also read:

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

Investment: ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో మహిళలు ఎందుకు వెనకబడుతున్నారు.. కారణమేంటంటే..

విద్యార్ధులకు అలర్ట్! TSRJC CET 2022 దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu