IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..

ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH), గుజరాత్‌ టైటాన్స్(GT) మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది...

IPL 2022: వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడిన విలియమ్సన్..
Srh
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 11, 2022 | 11:23 PM

ఐపీఎల్‌ 2022 (IPL 2022)లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్‌ స్పోర్ట్స్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH), గుజరాత్‌ టైటాన్స్(GT) మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా 42 బంతుల్లో 50(4 ఫోర్లు, ఒక సిక్స్) చేసి జట్టును ఆదుకున్నాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35(5 ఫోర్లు, ఒక సిక్స్) పరుగులతో రాణించాడు. వెడ్ 19, శుభ్‌మన్‌గిల్‌ 7, సాయి సూదర్శన్ 11, మిల్లర్ 12, తేవాతియా 6 పరుగులు చేశాడు. హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. జాన్‌సెన్‌, ఇమ్రాన్‌ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.

163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నెమ్మదిగా ఇన్సింగ్స్ ప్రారంభించింది. కేన్ విలియమ్సన్ నెమ్మదిగా ఆడగా.. అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడాడు. 32 బంతుల్లో 42(6 ఫోర్లు) పరుగులు చేసిన అభిషేక్‌ శర్మ రషీద్ ఖాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 17 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 57 పరుగులు చేసిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్(2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్34(2 ఫోర్లు, 2 సిక్స్‌ల్), మక్రమ్12 పరుగులు చేసి జట్టును గెలిపించారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, రషీద్‌ ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Read Also.. RR vs LSG: ఎవరీ పింక్ ఆర్మీ కొత్త అస్త్రం.. చివరి ఓవర్ స్పెషలిస్ట్‌గా ఎలా మారాడు?