David Warner: స్టేడియంలో పుష్ప సినిమా చూపించిన డెవిడ్ వార్నర్.. వైరల్‌గా మారిన వీడియో…
డెవిడ్ వార్నర్(David Warner) ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ఉంటాడు. మైదానంలోనే కాకుండా బయటకు సందడి చేస్తాడు...
డెవిడ్ వార్నర్(David Warner) ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా ఉంటాడు. మైదానంలోనే కాకుండా బయటకు సందడి చేస్తాడు. ఆదివారం అతను తన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులను అలరించాడు. ఆ తర్వాత మైదానంలో కొన్ని ట్రేడ్‌మార్క్ డ్యాన్స్ స్టెప్పులు వేశాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో ప్రేక్షకుల అభినందనలు పొందాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2022 (IPL 2022)మ్యాచ్‌లో పుష్ప సినిమాలోని శ్రీవల్లి(Srivalli) డ్యాన్స్ మూవ్‌ను ప్రదర్శించాడు వార్నర్. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ “మీ ఆలోచనలు ఏమిటి?? అని.. క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వార్నర్ ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేయడంతో DC 44 పరుగుల తేడాతో గేమ్‌ను గెలుచుకుంది. 216 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టాడు. IPL 2022 పాయింట్ల పట్టికలో ఢిల్లీ ప్రస్తుతం రెండు విజయాలు, రెండు పరాజయాలతో ఆరో స్థానంలో ఉంది.
వార్నర్ గతంలో తెలుగు, హిందీ సినిమా పాటలకు తనదైన స్టెప్పులు వేస్తూ నెట్టింట్లో నయా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మార్ఫ్‌డ్ ఫేస్ యాప్‌తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాల్లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. పాటలు, డైలాగులు ఇరగదీశాడు. ఇక బన్నీ నటించిన పుష్ప సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన అందులోని పాటలు, డైలాగులు, ఫైట్లను అనుకరించి అభిమానులను ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఇమిటేట్ చేశాడు ఈ స్టార్ క్రికెటర్. సల్లూభాయ్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ సినిమాలోని సీటీమార్ సాంగ్‌కు అద్భుతంగా స్టెప్పులేశాడు. అలాగే అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు వార్నర్ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. ఈ ఒక్క పాటకే కాదు చాలా పాటలకు వార్నర్ డ్యాన్స్ చేశారు. వార్నర్ డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Read Also.. RR vs LSG: ఎవరీ పింక్ ఆర్మీ కొత్త అస్త్రం.. చివరి ఓవర్ స్పెషలిస్ట్‌గా ఎలా మారాడు?