AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day: 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి.. రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు

జాతీయ జెండాను చూస్తుంటే భారతీయుల హృదయం ఉప్పొంగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురుస్కరించుకొని ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా అని ఇన్నారు. భారత్‌లో ప్రతిఒక్కరికి కులం, మతం, భాష లాంటి అనేక గుర్తింపులు ఉంటాయని.. కానీ వాటన్నిటికంటే భారతీయుడు అనే గుర్తింపు చాలా చాలా గొప్పదని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు కూడా రాజ్యాంగం ముందు సమానమేనని.. ప్రతిఒక్కరికి దేశంలో సమాన హక్కులు, అధికారాలు ఉన్నాయని చెప్పారు.

Independence Day: 2047లోగా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ ఉండాలి.. రాష్ట్రపతి ముర్ము కీలక వ్యాఖ్యలు
President Draupadi Murmu
Aravind B
|

Updated on: Aug 15, 2023 | 5:51 AM

Share

జాతీయ జెండాను చూస్తుంటే భారతీయుల హృదయం ఉప్పొంగుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురుస్కరించుకొని ఆమె పలు విషయాలు పంచుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా అని ఇన్నారు. భారత్‌లో ప్రతిఒక్కరికి కులం, మతం, భాష లాంటి అనేక గుర్తింపులు ఉంటాయని.. కానీ వాటన్నిటికంటే భారతీయుడు అనే గుర్తింపు చాలా చాలా గొప్పదని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు కూడా రాజ్యాంగం ముందు సమానమేనని.. ప్రతిఒక్కరికి దేశంలో సమాన హక్కులు, అధికారాలు ఉన్నాయని చెప్పారు. 1947 ఆగస్టు 15న మనమంతా కూడా పరాయి పాలన నుంచి విముక్తి పొంది మన విధిని మనమే రాసుకొనే స్వే్చ్ఛను పొందామని అన్నారు. దేశంలో జీడీపీ కూడా ప్రతి సంవత్సరం పెరుగుతోందన్నారు. అలాగే గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడానికి ఎన్నో కార్యక్రమాలను సైతం చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఆదివాసీల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని..అలాగే మహిళలు తమ సత్తా చాటుతూ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. అలాగే మహిళల సాధికార కోసం ప్రాధాన్యత ఇవ్వాలని దేశ ప్రజలని కోరుతున్నానని.. సోదరీమణులు ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగాలని కోరుతున్నానని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అలాగే దేశ ఆర్థిక అభివృద్ధితో పాటు మానవ వనరుల అభివృద్ధి, వివాద రహిత సమాజానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానం గురించి కూజా ఆమె స్పందించారు. దేశంలోని విద్యావ్యవస్థలో మార్పు మొదలైందని అన్నారు. విద్యార్థులు, పలువురు విద్యావేత్తలతో చర్చించిన అనంతరం అభ్యాస ప్రక్రియ మరింత సరళంగా మారిపోయిందని తాను గ్రహించినట్లు పేర్కొన్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం దేశంలో అనేక మార్పులకు, పరివర్తనకు దారితీస్తుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం సైతం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అలాగే ఈ ఏడాది చంద్రయాన్ – 3ని పంపించామని.. చంద్రునిపై అడుగుపెట్టే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని చెప్పారు. 2047లో అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారతదేశం ఉండాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవం ఈ విషయాన్ని మరొకసారి గుర్తుచేస్తోందని అన్నారు. భారత్ ప్రపంచ వేదికపైన తన సముచిత స్థానాన్ని పొందిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రమంలో కూడా తన స్థానాన్ని పెంచుకుందని తెలిపారు. అలాగే జీ20 అధ్యక్ష పదవితో భారత్ వాణిజ్యం, ఆర్థిక విషయాల్లో పురోగతి దిశగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా మరోవైపు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు దేశ పౌరులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి