Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poonch Terror Attack: జననీ జన్మ భూమిశ్చ.. మాతృదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తండ్రి తనయుడు

ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని జవాన్లు ప్రయాణం చేస్తున్న వ్యాన్ పై గ్రనేడ్ తో దాడి చేశారు. ఈ దాడిలో లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ వీరమరణం పొందాడు. 1999లో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కొడుకు కుల్వంత్ సింగ్. అప్పట్లో తండ్రిలాగే.. ఇప్పుడు కొడుకు అమరవీరుడయ్యాడు.

Poonch Terror Attack: జననీ జన్మ భూమిశ్చ.. మాతృదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తండ్రి తనయుడు
Kulwant Singh
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2023 | 1:04 PM

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. గ్రామస్తుల కోసం జవాన్లు ఇఫ్తార్ విందు కోసం సిద్ధం చేశారు. ఇఫ్తార్లో ఉపయోగించే వస్తువులను జవాన్లు ట్రక్కులో ఉంచారు. అప్పుడే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని జవాన్లు ప్రయాణం చేస్తున్న వ్యాన్ పై గ్రనేడ్ తో దాడి చేశారు. ఈ దాడిలో లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ వీరమరణం పొందాడు. 1999లో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కొడుకు కుల్వంత్ సింగ్. అప్పట్లో తండ్రిలాగే.. ఇప్పుడు కొడుకు అమరవీరుడయ్యాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ దేశ సేవలో యుద్ధభూమిలో వీరమరణం పొందాడు. కుల్వంత్ సింగ్ మరణంతో యావత్ దేశం కళ్లు చెమ్మగిల్లాయి.

ఆర్మీ సిబ్బందిపై ఉగ్రవాదులు రహస్యంగా దాడి చేశారు. ముందు నుంచి దాడి చేస్తే తాము ఒక్కరు కూడా ప్రాణంతో తప్పించుకోలేమని ఉగ్రవాదులకు తెలుసు. భారత సైన్యం శక్తి ముందు తమ ప్రతాపంముందు ఎందుకూ పనికిరామని వారికీ తెలుసు.. అందుకనే ఎప్పటిలా దొంగ చాటుగా ఆర్మీపై దెబ్బతీశారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కుల్వంత్ సింగ్ వీరమరణం పొందాడు. ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా కుల్వంత్ సింగ్ చిత్రాన్ని పోస్ట్ చేసి.. దేశభక్తి పంజాబీ రక్తంలో ఉందని అన్నారు. మరో కుమారుడు త్రివర్ణ పతాకం చుట్టుకుని స్వగ్రామానికి తిరిగొచ్చాడని కామెంట్ చేశారు. ఉగ్రవాదుల దొంగ దాడిలో లాన్స్ లైక్ కుల్వంత్ సింగ్ కూడా తన తండ్రిలాగే వీర్గతి సాధించాడు.

మోగాలో నివసిస్తోన్న కుటుంబం కుల్వంత్ తండ్రి మరణించిన 11 సంవత్సరాల తర్వాత 2010లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. కుల్వంత్ రక్తంలో దేశభక్తి  నిండివుంది. తన తండ్రిలా దేశ భక్తి చేయాలని భావించాడు. అందుకనే ఎవరు ఎంత చెప్పినా ఎవరి మాట వినకుండా ఇండియన్ ఆర్మీలో చేరాడు. లాన్స్ నాయక్ కుల్వంత్‌కు ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నర కుమార్తె, మూడు నెలల కుమారుడు ఉన్నాడు. కుటుంబం మోగాలోని చాడిక్ గ్రామంలో నివసిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లేముందు అంతా సర్దుకుంటుందని, కంగారుపడకు అని చెప్పానని తల్లి చెప్పింది.  కుల్వంత్ సింగ్ ఒక్కడే కుటుంబానికి ఆధారం. ఇప్పుడు ఉన్న ఒక్క ఆధారం ఆ కుటుంబానికి పోయిందని..  ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..