Floriculture: ఇటలీకి వెళ్లి కొత్త సాంకేతికతను నేర్చుకున్నాడు, పువ్వుల సాగుతో లక్షల్లో సంపాదిస్తున్నాడు

జెర్బెరా పువ్వు అనేది ఆఫ్రికాకి చెందిన పువ్వు. ఒక రకమైన అలంకారమైన పువ్వు. కళ్యాణం, పూజల్లో వేదికను అలంకరించేందుకు జర్బరా పూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, జెర్బెరా పువ్వుకు గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు డిమాండ్ పెరుగుతోంది.

Floriculture: ఇటలీకి వెళ్లి కొత్త సాంకేతికతను నేర్చుకున్నాడు, పువ్వుల సాగుతో లక్షల్లో సంపాదిస్తున్నాడు
Gerbera Flower
Follow us
Surya Kala

|

Updated on: Apr 22, 2023 | 12:33 PM

భారతదేశంలో వ్యవసాయాన్ని లాభాల బాట ఎలా పట్టించాలో క్రమంగా రైతులు తెలుసుకుంటున్నారు. చదువుకున్న యువత కూడా వ్యవసాయ రంగంవైపు దృష్టి సారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రైతులు చెరకు, గోధుమలు, బంగాళదుంపలు వంటి సాంప్రదాయ పంటలను పండించడమే కాదు.. పువ్వులు పండిస్తూ బాగా సంపాదిస్తున్నారు. దీంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి క్రమంగా కొత్త పద్ధతులతో వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అనేలా చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులు పూల సాగు చేస్తారు. అయితే సహరన్పూర్ విషయం భిన్నంగా ఉంటుంది. ఇక్కడి రైతులు పండించిన పూలను జిల్లా బయట కూడా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జెర్బెరా పువ్వుకు డిమాండ్ ఎక్కువ.

జెర్బెరా పువ్వు అనేది ఆఫ్రికాకి చెందిన పువ్వు. ఒక రకమైన అలంకారమైన పువ్వు. కళ్యాణం, పూజల్లో వేదికను అలంకరించేందుకు జర్బరా పూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో, జెర్బెరా పువ్వుకు గ్రామాల నుండి పెద్ద నగరాల వరకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగానే సహరన్‌పూర్‌కు చెందిన ఆదిత్య త్యాగి గులాబీ, బంతి పువ్వు వంటి పువ్వులకు బదులుగా జెర్బెరా పువ్వును సాగు చేయడం ప్రారంభించాడు.

ఉత్తరాఖండ్‌లోని అటవీ శాఖలో పని చేసిన ఆదిత్య త్యాగి  

ఇవి కూడా చదవండి

ఆదిత్య త్యాగి గతంలో ఉత్తరాఖండ్‌లోని అటవీ శాఖలో పనిచేశారు. రేంజర్ పదవి నుండి పదవీ విరమణ చేసిన తరువాత.. తన గ్రామానికి తిరిగి వచ్చాడు. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. సంప్రదాయ పంటలు కాకుండా పూల సాగు ఎందుకు ప్రారంభించకూడదని ఆలోచించాడు. ఈలోగా ఆదిత్య త్యాగి తన కుమారుడితో కలిసి సరదాగా గడపడం కోసం ఇటలీ వెళ్లాడు. అక్కడ పూల సాగులో కొత్త మెళకువలు నేర్చుకున్నాడు. కొంతకాలానికి ఆదిత్య త్యాగి భారత్‌కు తిరిగి వచ్చి  తర్వాత తన భూమిలో జెర్బెరా పూల సాగును ప్రారంభించాడు.

ఏడాదికి 8 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు

విశేషమేమిటంటే.. వ్యవసాయం ప్రారంభించే ముందు ఆదిత్య త్యాగి  4000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలీ హౌస్ నిర్మించాడు. ఈ హౌస్ నిర్మాణం కోసం రూ. 60 లక్షలు ఖర్చు చేశాడు. ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీ కూడా పొందాడు. అనంతరం ఆదిత్య పాలీ హౌస్‌లో జెర్బెరా పువ్వుల సాగును ప్రారంభించాడు. ఎట్టకేలకు అతని కష్టానికి తగిన ఫలితం దక్కడంతో ఇప్పుడు ఏడాదికి రూ.8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఆదిత్య పొలంలో రోజూ 4 నుంచి 5 మంది కూలీలు పని చేస్తుంటారు.

ఇసుక నేలలో మొక్కలు బాగా పెరుగుతాయి

బొకేల తయారీలో జెర్బెరా పువ్వులను కూడా ఉపయోగిస్తారు. ఏదైనా ఇతర పువ్వుతో కలిపి బొకేని తయారు చేస్తారు. ఈ పువ్వులను చేర్చడంతో బొకే అందం పెరుగుతుంది. అదే సమయంలో ఆయుర్వేద ఔషధాలను జెర్బెరా ఆకుల నుండి తయారు చేస్తారు. ఈ పువ్వులను పాలీ హౌస్‌లో మాత్రమే సాగు చేస్తారు. ఇసుక నేల దీనికి మంచిదని భావిస్తారు. ఇసుక నేలలో మొక్కల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..