AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడే మొదలైన పంజాబ్ పాలిటిక్స్.. సీఎం అమరీందర్ సింగ్ రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిశోర్

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పంజాబ్‌లో మరోసారి అడుగుపెట్టాడు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు.

అప్పుడే మొదలైన పంజాబ్ పాలిటిక్స్.. సీఎం అమరీందర్ సింగ్ రాజకీయ సలహాదారుగా ప్రశాంత్ కిశోర్
Balaraju Goud
|

Updated on: Mar 01, 2021 | 6:57 PM

Share

Prashant Kishor Advisor to Punjab CM : పంజాబ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం మొదలైంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పంజాబ్‌లో మరోసారి అడుగుపెట్టాడు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆయనకు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు. తన రాజకీయ సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కెప్టెన్ అమరీందర్ ఒక ట్వీట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. పంజాబ్ ప్రజల జీవితాలను మరింత మెరుగు పరిచేలా తామిద్దరూ కలిసి పనిచేసేందుకు ఉత్సుకతతో వేచిచూస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

2017లో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం వెనుక ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు. అమరీందర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా నిలిచి అఖండ విజయం సాధించిపెట్టారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇటీవల కాలంలో రైతుల ఆందోళన, బీజేపీతో శిరోమణి అకాలీదళ్ తెగతెంపులు చేసుకోవడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ ఎన్నికల్లో కలిసి వచ్చి గెలుపుబాటలు వేసుకునేందుకు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భావిస్తున్నారు.

కాగా, ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ‌ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ కోసం పనిచేస్తున్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీహార్ పుత్రికగా మమతకు ప్రజలు మళ్లీ పట్టం కడతారని, బీజేపీకి రెండంకెల స్థాయిలో కూడా సీట్లు రావని ఆయన ఇటీవల విస్పష్టంగా ప్రకటించారు.

ఇదిలావుంటే, ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్య సలహాదారుగా, నాతో చేరడం ఆనందంగా ఉంది. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం అమరీందర్ సింగ్ సోమవారం ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి కార్యాలయం కొద్దిసేపటికే క్రితమే ఈ విషయాన్ని ధృవీకరిస్తూ.. ట్వీట్ చేసింది, ప్రశాంత్ కిషోర్ కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ హోదాలో కొనసాగుతారని, అయితే, ఆయన గౌరవ వేతనం రూ. 1 మాత్రమేనని పేర్కొంది.

2022 ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచి సంస్థాగతంగా పార్టీ బలోపేతంలో పాటు అమరీందర్ సింగ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి వ్యుహాలు రచించనున్నారు ప్రశాంత్ కిశోర్. 2017 సంవత్సరంలో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లకు గానూ 77 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. మిస్టర్ కిషోర్‌తో పాటు అతని ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఆ విజయంలో పెద్ద పాత్ర పోషించాయి, యువ ఓటర్లను ఆకర్షించడానికి ‘ కాఫీ విత్ కెప్టెన్ (అమరీందర్ సింగ్)’ తో సహా ఓటర్లతో ఒక ప్రచారం చేసిన అనేక ప్రచార స్కెచ్లను రూపొందించారు. అంతకు ముందుకు కాంగ్రెస్ పార్టీ 2012 సంవత్సరంలో 46 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ ఏడాది అకాలీదళ్ బిజెపి కూటమి చేతిలో పరాజయం పాలైంది.

ఏదేమైనప్పటికీ, వచ్చే ఏడాది ఎన్నికలకు ముందే పంజాబ్‌లో కాంగ్రెస్ బలమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. గత నెల ప్రారంభంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలలో పార్టీ ఏడు మునిసిపల్ కార్పొరేషన్లను గెలుచుకుంది. మునిసిపల్ ఎన్నికల్లో అకాలీదళ్, బీజెపీ,ఆమ్ ఆద్మీ పార్టీలను పంజాబ్‌వాసులు తిరస్కరించడాన్ని ఈ విజయాలు సూచిస్తున్నాయని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. స్థానిక ఎన్నికలలో ఒక బలమైన ప్రదర్శన కనబర్చిన కాంగ్రెస్.. 2022 ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపిస్తామని సీఎం సింగ్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ప్రశాంత్ కిషోర్‌కు రాష్ట్ర ఎన్నికలలో తన విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ఉండటమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్.. అతని ఐపీఏసీ పశ్చిమ బెంగాల్‌లో కష్టపడి పనిచేస్తున్నారు. మార్చి 27 నుండి రికార్డు స్థాయిలో ఎనిమిది దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపీని ఓడించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైన సవాలును తగ్గించడానికి మమతా బెనర్జీకి ఆయన సహాయం చేస్తున్నారు. అటు, ఏప్రిల్ 6 న ఎన్నికలు జరగనున్న తమిళనాడులో డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్‌తో కలిసి ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నారు. అక్కడ కూడా బీజెపీని, ఆ పార్టీ కూటమి అయిన ఎఐఎడిఎంకేను గద్దె దింపాలని ఆయన భావిస్తున్నారు.

కాగా, పంజాబ్ రాష్ట్రంలో ఎత్తులు పైఎత్తులతో ఇప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది పంజాబ్. ప్రశాంత్ కిశోర్ పాచికలు ఏమేరకు పారుతాయో వేచిచూద్దాం….

Read Also..  కేంద్రం ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాలు ఏవి..? బీజేపీకి చుక్కలు చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌