కేంద్రం ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాలు ఏవి..? బీజేపీకి చుక్కలు చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య సవాళ్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు..

కేంద్రం ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాలు ఏవి..? బీజేపీకి చుక్కలు చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
Follow us
K Sammaiah

|

Updated on: Mar 01, 2021 | 7:15 PM

తెలంగాణ‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య సవాళ్ల పర్వం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ మధ్య చాలెంజ్‌ పాలిటిక్స్‌ పీక్‌ స్టేజ్‌కి చేరుతుంది. ముఖ్యంగా పట్టభద్రుల ఓట్ల ఆధారంగానే ఎన్నికల్లో గెలుపోటమలు తేలనుండటంతో ఆ వర్గాలే లక్ష్యంగా ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల అంశం పార్టీల ప్రచారంలో కీలకంగా మారింది.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులు నిరుత్సాహంగా ఉన్నారని, నోటిఫికేషన్లు లేక శాశ్వత నిరుద్యోగులుగా మారిపోయారని కాంగ్రెస్‌, బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అధికార పార్టీ నుంచి మంత్రి కేటీఆర్‌ లెక్కలతో సహా బయట పెట్టడం పార్టీల మధ్య మరింత అగ్గి రాజేసింది. అయితే మంత్రి కేటీఆర్‌ చెప్పే లెక్కలపై బహిరంగ చర్చకు రావాలని అటు కాంగ్రెస్‌, ఇటు బీజేపీ సవాళ్లు విసిరాయి.

ఈ నేపథ్యంలో విద్య‌, ఉద్యోగాల‌పై బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామ‌చంద‌ర్‌రావు విసిరిన స‌వాలుకు మంత్రి కేటీఆర్ దిమ్మ‌దిరిగే కౌంట‌ర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ గేటు బ‌య‌ట సోమ‌వారం ఉద‌యం 11 గంట‌ల క‌ల్లా వ‌స్తాను.. మీరూ రండి.. చ‌ర్చిద్దాం అంటూ ఆదివారం రామ‌చంద‌ర్‌రావు ట్వీట్ చేశారు. దీనిపై సోమ‌వారం ట్విట‌ర్‌లో కేటీఆర్ స్పందించారు.

గౌర‌వ‌నీయులైన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గారు ఇస్తాన‌న్న 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి 2 కోట్లు), జ‌న్‌ధ‌న్ ఖాతాల్లో వేస్తాన‌న్న రూ.15 ల‌క్ష‌ల స‌మాచారం సేక‌రించ‌డంలో నేను బిజీగా ఉన్నాను. కానీ ఇప్పటివ‌ర‌కు స‌మాధానం మాత్రం ఎన్‌డీఏ (ఎన్‌-నో, డీ-డేటా, ఏ-అవైల‌బుల్‌)నే. మీ ద‌గ్గ‌ర ఏమైనా స‌మాధానం ఉంటే షేర్ చేయండి అంటూ కేటీఆర్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇక రామ‌చంద‌ర్‌రావు విసిరిన ఇదే స‌వాలుపై ఇంత‌కుముందే ఆయ‌న‌కు ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ రాసిన బహిరంగ లేఖ‌ను, పుట్టా విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి ట్విట‌ర్ షేర్ చేసిన డేటాను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ల‌క్షా 26 వేల ఉద్యోగాలు ఇచ్చింద‌ని, మ‌రో 50 వేల ఉద్యోగాలు ఇచ్చే దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని పుట్టా విష్ణ‌వ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న ట్విట‌ర్‌లో స‌మ‌గ్ర స‌మాచారాన్ని షేర్ చేశారు.

Read more:

సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికిన కత్తులు.. న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో కీలక పురోగతి