AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికిన కత్తులు.. న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో కీలక పురోగతి

హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. హత్య కేసు విచారణకు కావాల్సిన కీలక ఆధారాలు..

సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికిన కత్తులు.. న్యాయవాది దంపతుల హత్య కేసు విచారణలో కీలక పురోగతి
K Sammaiah
|

Updated on: Mar 01, 2021 | 6:23 PM

Share

హైకోర్టు న్యాయవాది దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసులో కీలక పురోగతి లభించింది. హత్య కేసు విచారణకు కావాల్సిన కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. హత్యకు నిందితులు ఉపయోగించిన రెండు కత్తులు ఎట్టకేలకు సుందిళ్ల బ్యారేజ్‌లో దొరికాయి. బ్యారేజ్‌ 53, 54 పిల్లర్ల వద్దరెండు కత్తులను గజఈతగాళ్లు వెలికి తీశారు. కాగా కత్తుల కోసం పోలీసులు రెండు రోజులు వేట కొనసాగించగా సోమవారం వీరి ప్రయత్రం ఫలించింది.

ఆదివారం రోజు సాయంత్రం వారకు సుందిళ్ల బ్యారేజీలో కత్తుల కోసం గాలించిన పోలీసులు, గజ ఈతగాళ్లు.. రెండో రోజు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం సుందిళ్ల పార్వతి బ్యారేజ్ వద్దకు ఇద్దరు నిందితులను పోలీసులు తీసుకొచ్చారు. అయితే హత్యకు ఉపయోగించిన కత్తులను సుందిళ్ల బ్యారేజీలో 59 పిల్లర్ వద్ద పడేశామని గురువారం నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి చూపించగా నేడు 45వ పిల్లర్ నుంచి 60వ పిల్లర్ వరకు మధ్యలో పడేశామని మాట మార్చారు

దీంతో కేసులో కత్తులు కీలకంగా మారడంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించారు. ఈ క్రమంలో రెండు కత్తుల కోసం అయిదుగరు గజ ఈతగాళ్లతోపాటు 50 మంది పోలీసులు గాలించారు. వీరిలో ముగ్గురు గజఈతగాళ్ళు నీట మునిగి కత్తుల కోసం వెతికారు. పై నుంచి భారీ అయస్కాంతంతో పోలీసుల వెతికారు. చివరికి గజఈతగాళ్లకే కత్తులు లభ్యమయ్యాయి. ఇదిలా ఉండగా ఆరు వందల రూపాయల విలువ చేసే రెండు కత్తుల కోసం రెండు రోజులుగా పోలీసులు హైరానా పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే న్యాయవాదుల హత్య కేసు విచారణలో హత్యకు ఉపయోగించిన కత్తులు కీలకంగా మారాయి. కేసు విచారణలో భాగంగా హత్యలకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నిందితులను నిన్న పార్వతి బ్యారేజ్‌ వద్దకు తీసుకెళ్లారు. వారు చెప్పిన వివరాల ప్రకారం విశాఖకు చెందిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ఈరోజు మళ్లీ గాలింపు కొనసాగించారు. ఈసారి పెద్ద అయస్కాంతాల సాయంతో కత్తులను గుర్తించేందుకు శ్రమించారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం 59-60 పిల్లర్ల వద్ద నుంచి క్రమంగా 53వ నంబర్‌ పిల్లర్‌ వైపు గాలించగా అక్కడ కత్తి లభ్యమైంది. నీటి ప్రవాహానికి 59 నంబర్‌ పిల్లర్‌ నుంచి 53వ నంబర్‌ పిల్లర్‌ వైపు వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

కాగా, వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు, సోదరుడు గట్టు ఇంద్రశేఖర్‌లకు రామగుండం పోలీసులు పటిష్ఠ భద్రత కల్పిస్తున్నారు. గుంజపడుగులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్, పెట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. తనకు భద్రత కల్పించాలని ఇటీవల ఇనుముల సతీశ్‌ పోలీస్‌శాఖను అభ్యర్థించారు. భద్రత కల్పించేందుకు పోలీసులు సుముఖత వ్యక్తం చేసినా సతీశ్‌ అందుబాటులోకి రాలేదు.

Read more:

కర్ణాటక రైతులు తెలంగాణలో కలుస్తామంటున్నారు.. ఇది టీఆర్‌ఎస్‌ సాధించిన ఘనతన్న మంత్రి హరీశ్‌రావు