కర్ణాటక రైతులు తెలంగాణలో కలుస్తామంటున్నారు.. ఇది టీఆర్‌ఎస్‌ సాధించిన ఘనతన్న మంత్రి హరీశ్‌రావు

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్‌స్‌ స్పీడ్‌ పెంచింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తమ అభ్యర్థులను..

కర్ణాటక రైతులు తెలంగాణలో కలుస్తామంటున్నారు.. ఇది టీఆర్‌ఎస్‌ సాధించిన ఘనతన్న మంత్రి హరీశ్‌రావు
Follow us

|

Updated on: Mar 01, 2021 | 4:15 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్‌స్‌ స్పీడ్‌ పెంచింది. గులాబీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. కూకట్ పల్లి నియోజక వర్గంల నిర్వహించిన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. హరీశ్‌రావుతో పాటు మరో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు ,ఇతర టీఆరెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గంలో 5 లక్షల ఓట్లు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 24 వేల ఓట్లు ఉన్నాయి. కూకట్ పల్లి కార్యకర్తలకు శుభాకాంక్షలు, అభినందనలు.మేయర్ ఎన్నిక లో మీ పాత్ర కీలకం. మొన్నటి ఎన్నికల ఫలితాలను పునరావృతం చేయాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓటర్లకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

హైదరాబాద్, కూకట్ పల్లి లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగలి అంటే వాణి దేవి గారిని భారీ మెజార్టీ తో గెలిపించుకోవాలని హరీశ్‌ రావు అన్నారు. కూకట్ పల్లి బ్రహ్మాండమైన అండర్ పాస్,ఫ్లై ఓవర్ లు వచ్చాయి. ఇక్కడ రూ.200 కోట్లతో ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే కృష్ణారావుకు టీఆరెస్ పార్టీకే దక్కుతుందని చెప్పారు. కార్యకర్తలను సొం అన్నదమ్ములు గా చూసుకునే వ్యక్తి కృష్ణారావు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదే బాల నగర్ లో ఏం ఉండే. వారానికి మూడు రోజులు ధర్నాలు ఉండె. కానీ ఇప్పుడు ఓటీ లు చేస్తున్నారు మన కార్మికులు.

పరీక్షలు వస్తే చాలు విద్యార్థులు ఎన్నో అవస్థలు పడేవారు. తెలంగాణ వచ్చాక ఇన్వర్టర్ లు, జనరేటర్ లు పోయాయి 24 గంటల కరెంట్ వచ్చింది. మన మంచినీళ్ల పథకం కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. 24 గంటల రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మొన్న ఈ మధ్యలో బీదర్ పోయాను, పోతూ పోతూ ఒక్క తండా లో ఆగినా, ఒక్క అక్కను అడిగాను ఎందుకు అక్క ఇక్కడ ఉన్నారు అంటే కరెంట్ వస్తే నీళ్లు పట్టుకుందామని ఉన్నామని అన్నారు. బీజేపీ వాళ్ళకు చాలెంజ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రం లో ఏ ఊరుకి అయిన పొదమాని అంటున్నాను మీరు సిద్ధమా..? కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో రైతు బంధు లేదు, రైతు భీమా లేదు. కర్ణాటక కు చెందిన రైతు సంతోష్ వాళ్ళ గ్రామాన్ని తెలంగాణ లో కలుపుకోండి అన్నారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు వివరించారు.

ప్రశ్నించే గొంతు అంటున్నారు, ఏం ప్రశ్నిస్తున్నారు..? ఐటీఐఆర్ రానందుకు కేంద్రాన్ని ప్రశ్నించండి. డీజల్, పెట్రోల్, గ్యాస్ పెంచినందుకు బీజేపీ వాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. గ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు పెంచినందకు మీకు ఓటు వేయలా..? అని హరీశ్‌ రావు ప్రశ్నించారు. పెట్రోల్ పోయించుకునే ముందు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మొన్న బీజేపీ వాళ్ళు బడ్జెట్ పెట్టారు అందులో అంత మోసం ఉందో గ్రహించండి. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ లో మెట్రో రైలు, బులెట్ ట్రైన్ లు ఇచ్చారు మరి ఇక్కడ కూకట్ పల్లి నుండి ఎందుకు పఠాన్ చెరు వరకు పొడిగించలేదు అని హరీశ్‌రావు మండిపడ్డారు.

ఉన్న ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు ఉడకొట్టిన పార్టీ బీజేపీ పార్టీ. ప్రభుత్వ కంపనిలు ప్రైవేట్ పరం అవుతున్నాయి దీనితో దళిత బిడ్డలు రిజర్వేషన్లు కోల్పోతున్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అన్నారు అయితే ఇప్పటి 12 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు గోబెల్‌ ప్రచారం చేస్తారు తిప్పి కొట్టాలని కార్యకర్తలకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తిని ఏకాతాటికి తెచ్చి మహిళల శక్తి చూపించాలి. వాణి దేవి మంచి విద్యావేత్త ఎంతో మందికి విద్యని అందించిన గొప్ప వ్యక్తి. వాణి దేవికని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ వాణి దేవి ని ప్రకటించిన వెంటనే బీజేపీకి భయం పట్టుకుంది. అబద్ధాలను అందంగా చెప్తారు వాళ్లకు గొబెల్‌ ప్రచార అవార్డు ఇవ్వాలి. ఓటు వేయించే బాధ్యత మనది, ప్రశ్నించే గొంతు కావాలి అంటే పెరిగిన పెట్రోల్ డీజిల్ పై ప్రశ్నిస్తుంది.ఐటీ ఐ ఆర్ ఎందుకు రాష్ట్రం కు ఇవ్వలేదో ప్రశ్నిస్తుంది మా వాణి అక్క అని హరీశ్‌రావు అన్నారు.

మరో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మన చదువుల తల్లి సురభి వాణి దేవి ఎమ్మెల్సీగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ 7 సంవత్సరాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశం లోనే సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణ నెంబర్ 1 గా ఉంది. పక్క రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి లేదు. బిజెపి పాలిత రాష్ట్రాలు,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రైతు బంధు,రైతు భీమా ,ఇన్ని సాగునీటి ప్రాజెక్ట్ లు ఉన్నాయా….? అని మల్లారెడ్డి ప్రశ్నించారు.

తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిన ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. బాల నగర్ లో ఫ్లై ఓవర్ అవుతుంది అని అనుకున్నమా….కానీ ఇప్పుడు అవుతుంది. ఎన్నికల అయిపోగానే టీఆరెస్ కార్యకర్తలకు పదవులు వస్తాయి. ఆలోపు వాణి దేవి కోసం పని చేసి గెలిపించుకోవాలి. టీఆరెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. దేశంలో ఎక్కడ లేని కార్యకర్తలు మనకు ఉన్నారు. బీజేపీకి కార్యకర్తలు లేరు, క్యాడర్ లేదు. బీజేపీ కి ఈ ఎమ్మెల్సీ సిట్టింగ్ సిటు కానీ ఈసారి ఎక్కడికెళ్లి గెలుస్తారు. రామ చందర్ రావుకు నేను చాలెంజ్ చేస్తున్నా..ఈసారి ఈసీటు మాదేనని. మన ఓటు మనం వేసుకుంటే బీజేపీ ఓడినట్టే…మనం వేస్తూ మన బంధువులను కూడా ఓటు వెయించాలన్నారు.

ఒక్క సైనికుడు, ఉద్యమం మాదిరిగా కష్టపడి తే గెలుపు మనదే. మాజీ ప్రధాని కూతురు మన అభ్యర్థి వాణి దేవి. ఆమె చదువుల తల్లి ,ఎంతో మందికి చదువు చెప్పి ఉన్నత శిఖరాలకు అందించిందిజ కాంగ్రెస్ పార్టీ దివాళా తీసిన పార్టీ. వాళ్ళ మొఖం చూస్తే వాళ్ళకి ఓటు ఎవరు వేయరు. బీజేపీకి కూడా ఓటు బ్యాంకు లేదు. ఎక్కువ ఓట్లు మన మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి. వాళ్ళను అందరిని ఓటు వేయించి బాధ్యత మనపైన ఉందని కార్యకర్తలనుద్దేశించి మంత్రి మల్లారెడ్డి అన్నారు.

Rea more:

న్యాయవాద దంపతుల హత్య కేసుపై హైకోర్టులో విచారణ.. మార్చ్ 15 కు వాయిదా వేసిన ధర్మాసనం

‘మేఘా‘ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం.. బన్సీలాల్‌పేట్‌లో..
‘మేఘా‘ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ దినోత్సవం.. బన్సీలాల్‌పేట్‌లో..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసమే టిప్స్.. ఇవి తెలుసుకుంటే ఆ సమస్యలకు..
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
పీరియడ్స్ సమయంలో ఈ లక్షణం కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలి!
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ఓడినా ప్రపంచ రికార్డ్ లిఖించిన బెంగళూరు జట్టు.. అదేంటంటే?
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
ప్రభాస్ కోసం స్పెషల్ గిఫ్ట్ పంపిన వేణు స్వామి సతీమణి.. వీడియో
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
జనసేనకు భారీ ఊరట.. ఆ పార్టీకే గాజు గ్లాస్ గుర్తు..!
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
చెన్నై ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. గాయపడిన ధోని..
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
కాలి బొటన వేలు కంటే.. పక్కన వేలు పొడుగ్గా ఉందా.. దానికి అర్థం ఇదే
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఐశ్వర్య రాయ్ పాటకు ఇరగదీసిన ప్రేమలు హీరోయిన్.. వీడియో వైరల్..
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్
ఫేస్‌బుక్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసెంజర్‌లో మరో కొత్త ఫీచర్