సంచలనాలకు సెంటర్‌గా నిమ్మగడ్డ, మున్సిపల్ ఎన్నికల్లోనూ షాక్‌లు, బలవంతంగా పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో ఛాన్స్

ఏపీలో సంచలన నిర్ణయాలకు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారుతున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేసిన ఆయన.. బలవంతపు చర్యలతో పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో ఛాన్స్..

సంచలనాలకు సెంటర్‌గా నిమ్మగడ్డ,  మున్సిపల్ ఎన్నికల్లోనూ షాక్‌లు,  బలవంతంగా పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో ఛాన్స్

ఏపీలో సంచలన నిర్ణయాలకు సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారుతున్నారు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేసిన ఆయన.. బలవంతపు చర్యలతో పోటీ నుంచి తప్పుకున్న వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. బాధితుల అభ్యర్థనలపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇలాంటి వారిపై సానుభూతితో వ్యవహరించి బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌ కింద మరోసారి అవకాశం కల్పించే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఈసీకి ఉన్న స్పెషల్ పవర్స్‌ వినియోగించబోతున్నారు.

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై నిన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా ఎస్‌ఈసీ సమావేశమయ్యారు. ఆ తర్వాత బలవంతపు విత్ డ్రాలు, దౌర్జన్యాల కారణంగా నామినేషన్లు వేయలేని వారి రిక్వెస్ట్‌లపై కలెక్టర్లు నివేదికలు పంపారు. మరికొన్ని జిల్లాల నుంచి కూడా వివరాలు తెప్పించుకుని ఎన్నికల సంఘం తుది ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు రమేష్ కుమార్. మరోవైపు ఎన్నికలు పూర్తయ్యే వరకు గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తాత్కాలికంగా నిషేధిస్తున్నామని ప్రకటించారాయన.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియకు వార్డు వాలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచుతున్నట్లు ఎస్‌ఈసీ తేల్చి చెప్పింది. వాళ్లు ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఎన్నికల చట్టాల ప్రకారం దాన్ని అవినీతి చర్యగా పరిగణిస్తామని సూచించింది. క్రిమినల్‌ నేరాలకు పాల్పడ్డట్లుగా అభియోగాలు మోపుతామని హెచ్చరించింది. రాజకీయ పార్టీల గుర్తులపై జరిగే ఈ ఎన్నికల్లో అన్ని విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు తటస్థంగా వ్యవహరించాలని, ఇందులో వాలంటీర్లకూ ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.

రోడ్‌ షోలకు పర్మిషన్ ఇస్తామని.. ఖర్చు అభ్యర్థితో పాటు పార్టీ ఖాతాలో చూపాలన్నారు రమేష్ కుమార్.కరోనా కంట్రోల్‌లో ఉన్నప్పటికీ ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దన్నారు. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇవాళ విశాఖలో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Read also : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుపతి, చిత్తూరు పర్యటనను అడ్డుకున్న పోలీసులు, ఎయిర్ పోర్ట్ లో భీష్మించుకుని నేలపై కూర్చున్న చంద్రబాబు

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu