ఏలూరు వైసీపీలో ఫుల్ జోష్‌.. మంత్రి ఆళ్లనాని సమక్షంలో వైసీపీలోకి జోరందుకున్న చేరికలు

ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ వైసీపీలో ఫుల్‌ జోష్‌ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ

ఏలూరు వైసీపీలో ఫుల్ జోష్‌.. మంత్రి ఆళ్లనాని సమక్షంలో వైసీపీలోకి జోరందుకున్న చేరికలు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 01, 2021 | 3:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ వైసీపీలో ఫుల్‌ జోష్‌ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున తమ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి క్యూ కాడుతున్నరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నియోజకవర్గం ఏలూరులో వలసలు ఊపందుకున్నాయి. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్న క్రమంలో వైసీపీలోకి తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచే కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం క్యూ కడుతున్నారు.

గత కొద్ది రోజులుగా ఏలూరు నగరంలో పలు డివిజన్లలో నుండి పెద్దఎత్తున ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని ఉపముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో 31వ డివిజన్ కు చెందిన జిల్లా కోర్టు లోని న్యాయవాదుల గుమస్తాల అసోసియేషన్ అధ్యక్షులు నల్లా రాము తన అనుచరులతో జనసేన పార్టీకి గుడ్‌ బై చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు.

మంత్రి ఆళ్ల నాని, నల్ల రాము తో పాటు పలువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఏలూరులో ఇప్పటికే కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెంట్రల్ లైటింగ్, సెంటర్ డివైడర్స్,రోడ్లు డ్రైనేజీ, పార్కులు, బరియల్ గ్రౌండ్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు…

గత ప్రభుత్వం ఏలూరు కార్పొరేషన్ పూర్తిగా విస్మరించడం తో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఇప్పటికే చాలా వరకు పనులు పురోగతిలో ఉన్నాయని ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న దృశ్య పూర్తయిన పనులు ప్రారంభించడానికి కొంత ఆలస్యం అవుతుందని మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏలూరులో వైయస్సార్సీపి అన్ని స్థానాలలో విజయం సాధించడం తధ్యమని కొత్త పాలకవర్గం రాగానే అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని మంత్రి ఆళ్ల నాని చెప్పారు…

ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పోతర్లంక లక్ష్మణరావు, వైయస్సార్ సిపి నాయకులు మంచం మై బాబు, ఆచంట వెంకటేశ్వరరావు, బండార్ కిరణ్ కుమార్, శశిధర్ రెడ్డి, డి వి రామాంజనేయులు, అంబికా రాజా, మాకినేని వెంకటేశ్వరరావు, నవ హర్ష, న్యాయవాదులు రాజేంద్ర, కే రాజబాబు, ఎస్ అబ్రహాం లింకన్, యన్ వెంకట్రావు, అంబటి మణికుమార్, తంబి తదితరులు పాల్గొన్నారు..

Read more:

తెలంగాణ పండుగల ప్రాశస్త్యం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. పెద్దగట్టు జాతరలో మంత్రులు