AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యాయవాద దంపతుల హత్య కేసుపై హైకోర్టులో విచారణ.. మార్చ్ 15 కు వాయిదా వేసిన ధర్మాసనం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్య పై హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్య ల పై..

న్యాయవాద దంపతుల హత్య కేసుపై హైకోర్టులో విచారణ.. మార్చ్ 15 కు వాయిదా వేసిన ధర్మాసనం
K Sammaiah
|

Updated on: Mar 01, 2021 | 3:42 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతులు హత్య పై హైకోర్టు విచారణ చేపట్టింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్య ల పై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన పోలస్‌ శాఖ నివేదికను హైకోర్టుకు సమర్పించారు. విచారణ సందర్భంగా పోలీస్‌శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు వేసింది. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు వివారాలు అడిగింది.

A2-A3లను ఎందుకు మీరు 164 స్టేట్ మెంట్ నమోదు ఇంకా ఎందుకు చేయలేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ ని ఎందుకు రికార్డు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితులను అంబులెన్స్‌లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. మెజిస్ట్రేట్ ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

అయితే హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసు వాళ్ళు మొబైల్ ఫోన్స్ రక్తపు మరకలను కాల్ డేటా ని నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి ఎందుకు సీఆర్పీ పి సీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్టు ప్రశ్నకు ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లకు కూడా సాక్షులుగా గుర్తించామని కోర్టుకు ఏజి తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షుల కు ఎటువంటి రక్షణ కల్పించారో హైకోర్టు తెలపాలంది. పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి సీఆర్పీసీ164 క్రింద వాంగ్మూలం ఎందుకు సేకరించలేదని హైకోర్ట్ ప్రశ్నించింది. పోలీసు వారు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు తెలికపారు ఏజి. ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని తెలిపిన ఏజీ.. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు తెలిపారు.

నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందని ఏజీ తెలిపారు. కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేము రికార్డ్ చేయలేదని కేవలం 161 స్టేట్ మెంట్ మాత్రమే నమోదు చేశామన్న ఏజీ వివరించారు. ఇంకా రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15 కు వాయిదా వేసింది.

పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది.

లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని వ్యాఖ్యానించింది. సాక్ష్యాలను పకడ్బందీగా స్వీకరించాలని సూచించింది. న్యాయవాదుల హత్య తీవ్ర గర్హనీయమని వెల్లడించింది. హత్య కేసులో నిందితులకు శిక్షపడేలా చేయాలని ఆదేశించింది. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాఖ్యానించింది.

Read more:

తెలంగాణ పండుగల ప్రాశస్త్యం పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దే.. పెద్దగట్టు జాతరలో మంత్రులు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్