మార్చ్ 5న ఆంధ్రప్రదేశ్ బంద్.. సబ్బండ వర్గాలు మద్దతివ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు

ఆంధ్ర ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ..

మార్చ్ 5న ఆంధ్రప్రదేశ్ బంద్.. సబ్బండ వర్గాలు మద్దతివ్వాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 01, 2021 | 5:45 PM

ఆంధ్ర ప్రజల మనోభావాలకు, ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రేవేటికరణను వ్యతిరేకిస్తూ మార్చి 5 రాష్ట్ర బంద్ చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ సన్నాహక సమావేశం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, TNTUC నగర అధ్యక్షులు గదుల సాయిబాబు, IFTU జిల్లా నాయకులు గుబ్బల ఆదినారాయణ, AICCTU రాష్ట్ర నాయకులు గొడుగు సత్యన్నారాయణ, IFTU జిల్లా నాయకులు రాజబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా 2.5 లక్షల కోట్లు సమికరిస్తామని మోడీ ప్రకటన చేయడం బీజేపీ మతోన్మాద, నియంతృత్వ విధానాలకు పరాకాష్టని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజకీయంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా ఏ ప్రత్యేకతా లేకుండా చేసి కేంద్రంపై ఆధారపడాలనే కుట్రతోనే ఆంధ్రాబ్యాంక్ కంటే 3 రేట్లు చిన్నదైన యూనియన్ బ్యాంకులో విలీనం చేసారని, ఇప్పుడు రాష్ట్రానికి వన్నె తెచ్చిన నవరత్న హోదా కలిగిన ఏకైక విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రేవేటికరణ ద్వారా నిర్వీర్యం చేయాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. గతంలో విశాఖ ప్రాంతంలో హిందూస్థాన్ జింక్ పరిశ్రమను నష్టాలొస్తున్నాయని వాజ్ పాయి హయాంలో వేదాంత గ్రూపుకు అమ్మేసారని, 2014లో వేదాంత గ్రూపు పరిశ్రమను పూర్తిగా మూసివేసి 3వేల ఎకరాల పరిశ్రమ భూమిని రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుంటుందని, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములైన 30వేల ఎకరాలను కాజేయడానికే ప్రేవేటికరిస్తున్నారని విమర్శించారు.

నిజంగా నష్టాలనుండి విశాఖ ఉక్కుని బయటపడేయాలంటే సొంత ఘనులు కేటాయిస్తే సరిపోతుందని అన్నారు. 2020లో విశాఖ పరిశ్రమలో పేరుకుపోయిన లక్ష టన్నుల ఐరన్ నిల్వల విలువే 7వేల కోట్లు ఉంటుందని, అలాంటిది 1 లక్ష 50వేల కోట్లు విలువచేసే 30వేల ఎకరాలు భూములు, లక్ష టన్నుల నిల్వలు, లక్ష కోట్ల విలువచేసే యంత్ర పరికరాలు, ఐరన్ వోర్ నిల్వలు మొత్తం కలిపి 6వేల కోట్లకు అమ్మాలని నిర్ణయించటమే దేశంలో అతిపెద్ద అవినీతని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ అవసరాలకు నిధుల సమీకరణ పేరుతో దేశీయ సంస్థలను విదేశీయులకు అమ్ముతూ, మరోపక్క 6ఏళ్లలో 200 కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన 9లక్షల కోట్ల ఆదాయపు పన్ను మాఫీచేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. అందుకే కార్పొరేట్ కంపెనీలనుండి బీజేపీ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో విరాళాలు వేలకోట్లు పోగేసుకుంటు అవినీతిని సంస్థాగతం చేస్తుందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం జరిగే మార్చ్ 5 రాష్ట్ర బంద్ కి రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని విజప్తి చేశారు. ఈ బంద్ జయప్రదం కోరుతూ మార్చ్ 2వతేది విస్తృత సమావేశం విశాఖ ఉక్కు పరిరక్షణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజాస్వామ్య మేధావులు, సామాజిక ఉద్యమకారులు, దళిత, మైనారిటీ సంఘాలు, జిల్లా ప్రజానీకం, వ్యాపార సంఘాలు, ఆటో, ట్రాన్స్ పోర్ట్ సోదరులు ఈ బంద్ లో స్వచ్చందంగా పాల్గొని ఆంధ్ర ప్రజల స్వాభిమానాన్ని చాటాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు జరిగే పోరాటాలను మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేసారు. ఈ సన్నాహక సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మాలకా రమణ, ఉపాధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి, నగర ఉపాధ్యక్షులు మెడిశెట్టి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Read more:

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కీలక సమీక్ష.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు ఆదేశం

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?