AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కీలక సమీక్ష.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు ఆదేశం

పోలవరం ప్రాజెక్టుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక..

పోలవరం ప్రాజెక్టుపై సీఎం కీలక సమీక్ష.. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని అధికారులకు ఆదేశం
cm-jagan-
K Sammaiah
|

Updated on: Mar 01, 2021 | 5:03 PM

Share

పోలవరం ప్రాజెక్టుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనులపై సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, జలవనరులశాఖ కార్యదర్శి జే శ్యామలరావు, ఈఎన్‌సి సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. పోలవరం నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలవల్ల పనులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని సమావేశంలో ప్రస్తావించారు. స్పిల్‌ వే పూర్తికాకుండా.. కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వవచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఒక పద్ధతి ప్రకారం కాకుండా.. అక్కడక్కడా అరకొరగా పనులు చేసి వదిలిపెట్టిన విషయాన్ని చర్చించారు.

గతంలో కాఫర్‌ డ్యాంలో ఉంచిన ఖాళీల కారణంగా వరదల సమయంలో సెకనుకు సుమారు 13 మీటర్లు వేగంతో వరద ప్రవాహం వచ్చిందని తెలిపిన అధికారులు.. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం వద్ద గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 లలో భారీ ఎత్తున కోతకు గురైందన్నారు. ఫలితంగా వరదల సమయంలో స్పిల్‌ఛానల్‌ పనులకూ తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ పనులు అన్నింటిపైనా ఇప్పుడు ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని సీఎంకు వివరించారు. స్పిల్‌వే పనులు పూర్తయ్యాయని సీఎంకు తెలిపిన అధికారులు.. గేట్లు, సిలిండర్ల బిగింపు చురుగ్గా సాగుతోందని వెల్లడించారు

ఈ సందర్భంగా స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అవి పూర్తయ్యేలోగా కాఫర్‌ డ్యాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. దీనివల్ల వచ్చే వరదనీటిని స్పిల్‌ వే మీదుగా పంపే అవకాశం ఉంటుందన్నారు సీఎం. మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. పోలవరం సహాయపునరావాస కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు.

పోలవరం ఎత్తు తగ్గింపుపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆ కథనాలను పట్టుకుని చేస్తున్న దుష్ప్రచారంపై సమావేశంలో చర్చించారు. అసలు అలాంటి అవకాశమే లేదని స్పష్టంచేసిన అధికారులు.. సీడబ్ల్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని వెల్లడించారు. ఎత్తు తగ్గింపుపై ఇప్పుడు చర్చలు, ప్రతిపాదనలు అసంబద్ధమంటూ సెంట్రల్‌ వాటర్‌కమిషన్, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ విస్పష్టంగా చెప్పాయని సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే నిర్దేశిత ఎత్తుకు తగిన విధంగా షట్టర్లు బిగింపు పూర్తవుతోందని వెల్లడించారు.

నదుల అనుసంధానంపై రాష్ట్రం తరఫునుంచి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ఉండాలన్నారు సీఎం. నదుల అనుసంధానం వల్ల ఇక్కడ ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపాదనలు ఉండాలని సీఎం ఆదేశించారు. అయోమయాలకు, సందిగ్ధతలకు తావులేకుండా, ఉభయ తారకంగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం అన్నారు. వీటిని కేంద్రానికి పంపుదామని అధికారులకు తెలిపిన సీఎం.. మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై ప్రతిపాదనల నేపథ్యంలో అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

పోలవరం వద్ద వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణంపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా వైయస్సార్‌ గార్డెన్స్‌ మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలను సీఎంకు అధికారులు వివరించారు. పోలవరం వద్ద జి– హిల్‌సైట్‌పై 100 అడుగుల ఎత్తుతో వైయస్సార్‌ విగ్రహం నిర్మించనున్నారు. వైయస్సార్‌ గార్డెన్స్‌పై సీఎంకు అధికారులు ప్రతిపాదనలు వివరించారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆహ్లాదం, అందం పెరిగేలా వైయస్సార్‌ గార్డెన్స్‌ నిర్మాణ రీతులు ఉండాలన్నారు సీఎం జగన్‌. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిజైన్లను రూపొందించాలన్నారు.

ప్రకృతి సమతుల్యతను మరింత పెంచే విధంగా నిర్మాణ రీతులు ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. నిర్వహణా వ్యయం కనిష్టంగా ఉండేలా డిజైన్లను రూపొందించాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణం, ఈ బ్రిడ్జి నుంచి జి– హిల్‌ను అనుసంధానిస్తూ రోడ్డును ప్రతిపాదించడంతో సీఎం సానుకూలత వ్యక్తం చేశారు.

Read more:

పిల్ల‌ల ఆసుప‌త్రికి 5 ఎక‌రాలు.. సీనియ‌ర్ అధికారుల స‌మీక్షలో టీటీడీ ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Follow Us