ఎన్నికల వేళ, గిరిజన యువతులతో డ్యాన్సుల హేల , అస్సాంలో ప్రియాంక గాంధీ రూటే వేరు !

కాంగ్రెస్ నేత  ప్రియాంక గాంధీ ప్రస్తుతం అస్సాంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో సుడిగాలి పర్యటనలు.....

  • Umakanth Rao
  • Publish Date - 7:04 pm, Mon, 1 March 21
ఎన్నికల వేళ, గిరిజన యువతులతో డ్యాన్సుల హేల , అస్సాంలో ప్రియాంక గాంధీ రూటే వేరు !

కాంగ్రెస్ నేత  ప్రియాంక గాంధీ ప్రస్తుతం అస్సాంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సోమవారం ఆమె లఖింపూర్ జిల్లాలో  టీ తోటలను విజిట్ చేస్తూ.. ఒక దశలో ఉత్సాహం  పట్టలేక   అక్కడి గిరిజన యువతులతో  కలిసి డ్యాన్స్ చేశారు. ఝముర్ అని వ్యవహరించే ఈ డ్యాన్స్ లో ఆమె ఢోల్ బీట్స్ కి అనుగుణంగా స్టెప్పులు వేయడం  విశేషం. దీన్ని పార్టీ ట్వీట్ చేసింది. పర్పుల్ శారీ,  సంప్రదాయబధ్ధమైన స్కార్ఫ్ సారించిన ఆమె.. ఎర్ర చీరలు కట్టుకున్న యువతులతో స్టెప్పులు వేశారు. చిరునవ్వుల ప్రియాంక గాంధీని చూసిన స్థానికులు కూడా ఆమె నృత్యం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిముషం నిడివి గల ఈ వీడియో ముఖ్యంగా పార్టీ నేతలను, కార్యకర్తలను ఉత్సాహంలో ముంచెత్తుతోంది.

సోమవారం ఉదయం గౌహతిలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసిన ప్రియాంక..ఆ తరువాత ఇక్కడికి 370 కి.మీ దూరంలోని లఖింపూర్ జిల్లాను విజిట్ చేశారు. మొదట గౌహతి విమానాశ్రయంలో కూడా ఆమెకు అస్సాం వాసుల సాంప్రదాయక బిహూ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో స్వాగతం లభించడం విశేషం. అటు-లఖింపూర్ నుంచి ఈ కాంగ్రెస్ నేత ‘నిరుద్యోగ నిరసన’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రియాంక పిలుపునిచ్చారు. ఆమె మంగళవారం కూడా ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాగా ఈమె  సోదరుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం తమిళనాడులో పర్యటిస్తున్నారు.

ఇలా ఉండగా  బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ నేత హగ్రామా మోహిలారీ ఇటీవల మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.  2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సంస్థ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కానీ ఇప్పుడు దీని వైఖరి మారింది. తాను లేనప్పుడు ఆ  పార్టీ రాష్ట్రంలో పెత్తనాన్ని చెలాయించ జూసిందని ఆయన ఆరోపిస్తున్నారు. అందువల్లే కాంగ్రెస్ కి దగ్గరయ్యానని అంటున్నారు. అస్సాంనుంచి  బీజేపీని ‘పారదోలుతామని’ హగ్రామా ప్రకటించారు.

 

మరిన్ని  చదవండి:

Tiger Songs: పెద్ద పులి పాట పాడుతోంది.. వీరు విన్నారా..! అయితే వినండి..! ఎవరికోసమే తెలుసా..!

Sobhan Babu : సినిమా ఇండస్ట్రీలో ఎందరో వందల కోట్లు కూడబెట్టడానికి అసలు కారణం శోభన్ బాబు అని తెలుసా?