Covid-19 Vaccination: రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు.. రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జీలకు టీకా

vaccine shots: దేశంలో రెండో దశ కరోనా టీకా పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కూడా ఇవాళ వ్యాక్సిన్‌

Covid-19 Vaccination: రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు.. రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జీలకు టీకా
Covid Vaccination
Follow us

|

Updated on: Mar 01, 2021 | 5:39 PM

Covid-19 vaccine shots: దేశంలో రెండో దశ కరోనా టీకా పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు కూడా ఇవాళ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మంగళవారం నుంచి టీకా ఇవ్వనున్నారు. ఇందుకోసం న్యాయస్థానం ప్రాంగణంలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కోర్టు రిజిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. న్యాయమూర్తులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా టీకాలు వేయనున్నట్లు పేర్కొన్నారు.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం 6 గంటలకు ఎయిమ్స్‌లో తొలి డోసు తీసుకున్నారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులు కూడా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. బిహార్‌, ఒడిశా ముఖ్యమంత్రులు నితీశ్‌ కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌, రాజస్థాన్‌ గవర్నర్‌ కల్రాజ్‌ మిశ్రా, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నేడు టీకా తీసుకున్నారు.

అయితే.. రెండోదశలో భాగంగా దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ షూరు అయింది. ఈ డ్రైవ్‌లో ప్రధానంగా 60 ఏళ్లు పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు. ప్రైవేట్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అలాగే కోవిడ్ -19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్, ఆరోగ్య సేతును కో-విన్ పోర్టల్‌తో అనుసంధానం చేసి.. వినియోగదారులు టీకా ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని సులభతరం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ టీకాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రైవేటులో టీకా ఒక్కో డోసు ధర రూ. 250గా కేంద్రం నిర్ణయించింది.

”కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఎలాంటి సమాచారం కావాలన్నా ఆరోగ్య సేతు యాప్ ద్వారా లభ్యమవుతుందని.. టీకా సమాచారాన్ని యాక్సెస్ చేయండి, కో-విన్ డాష్‌బోర్డ్‌ను చూడండి, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే.. టీకా ధృవీకరణ పత్రాలను డౌన్‌లోడ్ చేయండి” అని ఆరోగ్య సేతు ట్విట్టర్‌ ద్వారా పేర్కొంది..

మరిన్ని ఇక్కడ చదవండి:

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

Shanmukh Jaswanth Case: షణ్ముక్ జశ్వంత్ ఆ ఒక్క మాట.!! రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు..!

టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..