నాకు వ్యాక్సిన్ వద్దు.. ముందు యువతకు ఇవ్వండి.. కోవిడ్ టీకాపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ మార్చి 1నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

  • Balaraju Goud
  • Publish Date - 10:22 pm, Mon, 1 March 21
నాకు వ్యాక్సిన్ వద్దు.. ముందు యువతకు ఇవ్వండి.. కోవిడ్ టీకాపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు..!

Mallikarjun Kharge on vaccine : కోవిడ్ వ్యాక్సినేషన్ పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ్య మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ మార్చి 1నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తనకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వడం కంటే యువతకు అందిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన.. ఈ సందర్భంగా మీరు వ్యాక్సిన్‌ తీసుకుంటారా అని ప్రశ్నించగా.. తాను మరో పది, పదిహేనేళ్లు బతుకుతానని.. ఇప్పుడు వ్యాక్సిన్‌ తనకవసరం లేదని స్పష్టం చేశారు. యువతకు భవిష్యత్తు ఎక్కువ ఉందని, వారికి ముందుగా టీకా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. అందరికీ వేసాక, చివరికి తాను కూడా వ్యాక్సిన్‌ తీసుకుంటానని బదులిచ్చారు.

అదే విధంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసిన శాస్త్రవేత్తలను ఖర్గే అభినందించారు. అయితే అలాంటి విజయాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవద్దన్నారు. దేశంలో బీజేపీ విభజించు-పాలించు సూత్రాన్ని పాటిస్తోందని, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను కూలగొట్టాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మాటలు పరోక్షంగా మోదీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం కోవిడ్‌ తొలి టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై వదంతులు ప్రచారం చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ కొవాగ్జిన్ డోసు తీసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదీ చదవండి: