AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముగిసిన జేఈఈ మెయిన్ పరీక్ష.. ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు..! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే..?

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ‘కీ’ పేపరు కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముగిసిన జేఈఈ మెయిన్ పరీక్ష.. ఆన్సర్ కీ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు..! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే..?
Balaraju Goud
|

Updated on: Mar 01, 2021 | 10:03 PM

Share

JEE Main Answer key 2021 : దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ముగిశాయి. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ ‘కీ’ పేపరు కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షకు విడుదలకు సంబంధించి విషయమై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అయితే అతి త్వరలోనే ఆన్సర్ కీ విడుదల చేస్తామని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. విడుదలైన అనంతరం ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్లో ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చని వెల్లడించారు.

ఆన్సర్ కీ ని చెక్ చేసుకున్న అనంతరం అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వీటిపై నిపుణుల సమక్షంలో విశ్లేషిస్తామన్నారు. ఇందు కోసం రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను నిపుణులు సమీక్షిస్తారు. వారి అభ్యంతరాలను సరైనవిగా భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో ఎన్‌టీఏ నిర్ణయమే ఫైనల్ అవుతుందని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన అనంతరం తుది ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. ఈ ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగానే ఫలితాలను ప్రకటిస్తామని ఎన్‌టీఏ పేర్కొంది.

మరోవైపు, మెయిన్ ఫిబ్రవరి సెషన్ ఫలితాలను మార్చి 7న ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మొత్తం 6 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరయ్యారు. విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపిన వివరాల ప్రకారం నమోదు చేసుకున్న వారిలో 95 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

ఇదిలావుంటే, ఈసారి జేఈఈ మెయిన్ పరీక్షను 13 భాషల్లో నిర్వహించారు. తెలుగు, తమిళం, పంజాబీ, ఉర్దు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతీ తదితర భాషల్లో ఈ పరీక్షను నిర్వహించారు. 2021 నుంచి ఈ పరీక్షను ఏడాదికి నాలుగు సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. విద్యార్థులు తమ స్కోర్ ను పెంచుకోవడానికే ఈ అవకాశం కల్పించారు. ఈ పరీక్ష సెకండ్ ఫేజ్ ను మార్చిలో నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి… soup for night time: రాత్రిళ్లు ఈ సూప్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయట.. ఎలా తయారు చేయాలంటే..