DRDO Jobs: డీఆర్‌డీఓలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరు.. చివరి తేది ఎప్పుడంటే..

Apprentice In DRDO: ప్రముఖ రక్షణ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తాజాగా అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో..

DRDO Jobs: డీఆర్‌డీఓలో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరు.. చివరి తేది ఎప్పుడంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 01, 2021 | 7:15 PM

Apprentice In DRDO: ప్రముఖ రక్షణ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) తాజాగా అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 71 అప్రెంటిస్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీ డెహ్రడూన్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ ల్యాబరేటీ (DEAL)లో చేపట్టనున్నారు.

ఎవరు అర్హులంటే..

ఈ అప్రెంటిస్ పోస్టులకు 2018,2019,2020 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది కాలానికి అప్రెంటిస్‌షిప్ కోసం ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. చివరి తేదీ.. ఈ పోస్టుల భర్తీ దరఖాస్తును మార్చి 12ను చివరి తేదీగా ప్రకటించారు. ఇక నోటిఫేకషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

డిప్లొమా అప్రెంటీస్ ట్రైనీ- 24 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 7 మెకానికల్ ఇంజనీరింగ్- 4 కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్- 13 ఐటీఐ అప్రెంటీస్ ట్రైనీ- 47 ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 24 మెషినిస్ట్- 7 టర్నర్- 6 ఫిట్టర్- 10

అర్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఇక ఐటీఐ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఇక అభ్యర్థుల వయసు విషయానికొస్తే.. 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్‌ http://portal.mhrdnats.gov.in/ లో.. అలాగే ఐటీఐ అప్రెంటీస్ అభ్యర్థులు https://apprenticeshipindia.org/ పోర్టల్‌లోకి వెళ్లి సంబంధిత వివరాలను ఎంటర్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: Organ Donation: యాక్సిడెంట్‌తో బ్రెయిన్ డెడ్ కానీ.. మరో నలుగురికి ప్రాణదానం.. మానవత్వం పరిమళించింది

Immunity Booster: కరోనా వైరస్ నేపథ్యంలో రోగనిరోధక శక్తి లేదని భయపడుతున్నారా..! ఆ గడ్డి రసం తీసుకుంటే చాలు

NABARD: పీజీ విద్యార్థులకు నాబార్డ్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్.. నెలకు రూ.18,000 స్టైపెండ్.. చివరి తేది ఎప్పుడంటే..