AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Organ Donation: యాక్సిడెంట్‌తో బ్రెయిన్ డెడ్ కానీ.. మరో నలుగురికి ప్రాణదానం.. మానవత్వం పరిమళించింది

తాను చనిపోతాడో లేక బతికే ఛాన్స్ ఏమైనా వుందో క్లారిటీ లేదా జీమన్మృతుని కుటుంబీకులకు. కానీ.. అతని అవయవాలు మరికొందరి ప్రాణాలను నిలబెడతాయని నమ్మారు. అంతే.. బ్రెయిన్ డెడ్...

Organ Donation: యాక్సిడెంట్‌తో బ్రెయిన్ డెడ్ కానీ.. మరో నలుగురికి ప్రాణదానం.. మానవత్వం పరిమళించింది
Rajesh Sharma
|

Updated on: Mar 01, 2021 | 6:54 PM

Share

Brain dead person donated organs to four patients: తాను చనిపోతాడో లేక బతికే ఛాన్స్ ఏమైనా వుందో క్లారిటీ లేదా జీమన్మృతుని కుటుంబీకులకు. కానీ.. అతని అవయవాలు మరికొందరి ప్రాణాలను నిలబెడతాయని నమ్మారు. అంతే.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలతో  మరో నలుగురికి ప్రాణాలు నిలబెట్టేందుకు అంగీకరించారు. ఇది ప్రకాశం జిల్లాలో జరిగింది.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను దానం చేసి మరో నలుగురికి ప్రాణ దానం చేశారు. ప్రకాశం జిల్లా చందలూరుకు చెందిన 50 సంవత్సరాల నూతలపాటి వెంకటేశ్వర్లుకి యాక్సిడెంట్ అయింది. దీంతో చికిత్స కోసం ఆయన బందువులు గుంటూరు నగరంలోని రమేష్ హాస్పిటల్స్ జాయిన్ చేశారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్ దాన్ సంస్థ వాలంటీర్లు అవయవదానం యొక్క విశిష్టతను కుటుంబ సభ్యులకు తెలియ చేయడంతో వారు అవయవ దానానికి అంగీకరించారు. గుండె, ఊపిరి తిత్తులను చెన్నై నగరంలోని ఎమ్.జి.ఎమ్ హాస్పిటల్ కు..  లివర్, కిడ్నీలను విజయవాడ హాస్పిటల్‌కు జీవన్ దాన్ సంస్థ కేటాయించింది. రమేష్ హాస్పిటల్స్‌లోనే అవయవాలను వేరు చేసి గ్రీన్ ఛానల్ ద్వారా విమానాశ్రయానికి, మిగిలిన హాస్పిటల్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

అవయవాలను వేగంగా గమ్యాలకు చేర్చేందుకు ఏపీ పోలీసు విభాగం తగిన ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత సమయంలో అవయవాలు గమ్యాలకు చేరాల్సి వుండడంతో దానికి అనుగుణంగా ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు పోలీసు విభాగం తగిన విధంగా స్పందిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్న పోలీసులకు రోగుల బంధువులు, ఆసుపత్రి వర్గాలు కృతఙ్ఙతుల తెలిపాయి. అవయవదానానికి ముందుకొచ్చిన జీవన్మృతుని కుటుంబీకులను, అందుకు ప్రోత్సహించిన జీవన్ దాన్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులను పలువురు అభినందించారు.

ALSO READ: ఓవైపు కరోనా..ఇంకోవైపు ఎండలు.. అకాడమిక్ ఇయర్ రద్దేనా?

ALSO READ: హడలెత్తిస్తున్న మొసళ్ళు.. ఇటీవల కాలంలో ఎన్నో దాడులు.. ఎలా దాడులకు దిగాయో తెలిస్తే షాకే!

ALSO READ: ఈసారి మాడు పగలడం ఖాయం.. దంచికొట్టనున్న ఎండలు