PM Narendra Modi: నేడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవస్థాపక దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..

NHRC foundation day: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ

PM Narendra Modi: నేడు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వ్యవస్థాపక దినోత్సవం.. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
Pm Narendra Modi
Follow us

|

Updated on: Oct 12, 2021 | 9:08 AM

NHRC foundation day: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించనున్నట్లు ఎన్‌హెచ్ఆర్‌సీ మంగళవారం ట్విట్ చేసింది. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కాగా.. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సోమవారం ట్విట్ చేసి వెల్లడించారు. అణగారిన వర్గాల మానవ హక్కులు, వారి గౌరవాన్ని కాపాడడంలో మన దేశంలో ఎన్‌హెచ్‌ఆర్‌సి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు NHRC 28వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించనున్నట్లు ప్రధాని తెలిపారు. అట్టడుగు వర్గాల హక్కులు కాపాడడంలో జాతీయ మానవ హక్కుల సంఘం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందంటూ ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా (భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్) పాల్గొననున్నారు. మానవ హక్కులను పరిరక్షించేందుకు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని 1993 అక్టోబర్ 12న ఏర్పాటు చేశారు.

ఈ కమిషన్ ఏ విధమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగినా.. విచారణ చేపట్టి నివేదికను అందజేస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘన కేసులను గుర్తించడం, బాధితులకు పరిహారం చెల్లించడం, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది.

Also Read:

Bank holidays October 2021: ఖాతాదారులకు అలెర్ట్.. వరుసగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడప్పుడంటే..?

Fixed Deposit: మీరు బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నారా? ఇలా చేస్తే అధిక రాబడి పొందవచ్చు..!