Bank holidays October 2021: ఖాతాదారులకు అలెర్ట్.. వరుసగా 9 రోజులు బ్యాంకులు బంద్.. ఎప్పుడప్పుడంటే..?
Bank holidays October 2021: మీరు ఈ నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలని భావిస్తున్నారా.. అయితే ఈ వార్తను మరి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. ప్రభుత్వ, ప్రైవేట్
Bank holidays October 2021: మీరు ఈ నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించాలని భావిస్తున్నారా.. అయితే ఈ వార్తను మరి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు బుధవారం నుంచి తొమ్మిది రోజులపాటు సెలవులు ఉన్నాయి. అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా దుర్గాపూజ, నవరాత్రి, దసరా తదితర పండుగలు ఉన్న నేపథ్యంలో దాదాపు 9రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆర్బీఐ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్‌లో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే రాష్ట్రాల వారీగా సెలవుల్లో తేడాలు ఉన్న విషయాన్ని బ్యాంకుల ఖాతాదారులు గమనించాలని బ్యాంకు సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పని చేస్తూనే ఉంటాయని బ్యాంకులు వెల్లడించాయి. నేటినుంచి తొమ్మిది రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ప్రాంతాల వారీగా సెలవులను ఒకసారి తెలుసుకుందాం..
సెలవుల వివరాలు..
అక్టోబర్ 12: దుర్గా పూజ (మహా సప్తమి) – అగర్తాల, కోల్‌కతా అక్టోబర్ 13: దుర్గాపూజ (మహా అష్టమి) – అగర్తాల, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, గువాహటి, ఇంఫాల్, కోల్‌కతా, పాట్నా, రాంచీ. అక్టోబర్ 14: దుర్గా పూజ/ దసరా (మహానవమి/ ఆయుధ పూజ) – అగర్తాల, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్, గువాహటి, కాన్పూర్, కోచి, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, శ్రీనగర్, తిరువనంతపురం. అక్టోబర్ 15: దుర్గాపూజ / దసరా (విజయ దశమి) / ఇంఫాల్, సిమ్లా మినహాల్లో మినహా అన్ని చోట్ల సెలవులు. అక్టోబర్ 16: దుర్గాపూజ / గ్యాంగ్‌టక్ అక్టోబర్ 17: ఆదివారం అక్టోబర్ 18: కాటి బిహు (గువాహటి) అక్టోబర్ 19: ఈద్ ఎ మిలాద్ అక్టోబర్ 20: వాల్మికి జయంతి అక్టోబర్ 22: ఈద్ ఈ మిలాద్ ఉల్ నబీ (జమ్ము, శ్రీనగర్) అక్టోబర్ 23: నాలుగో శనివారం అక్టోబర్ 24: ఆదివారం
పైన పేర్కొన్న సెలవులు వివిధ ప్రాంతాలలో రాష్ట్రాలు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉన్నాయి. అయితే గెజిటెడ్ సెలవుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. బ్యాంకు ఖాతాదారులు ఈ సెలవులను ముందుగానే తెలుసుకుంటే.. మంచిదని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: