Fuel price today: వాహనదారులకు ఉపశమనం.. వరుస బాదుడుకు బ్రేక్.. ఇవాళ పెట్రోల్, డీజిల్ రేట్లు ఎంతంటే..
Fuel price today: ఇంధన ధరల విషయంలో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు ఇవాళ బ్రేక్ పడిండి.
Fuel price today: ఇంధన ధరల విషయంలో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు ఇవాళ బ్రేక్ పడిండి. ఏడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్న చమురు కంపెనీలు.. ఇవాళ విరామం ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చేయలేదు. దేశ వ్యాప్తంగా ఇవాళ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.44 ఉండగా, ఒక లీటర్ డీజిల్ ధర రూ. 93.17 గా ఉంది.
దేశ వ్యాప్తంగా నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 104.44 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .93.17. ముంబైలో పెట్రోల్ ధర రూ .110.41, డీజిల్ ధర లీటరుకు రూ. 101.03. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 105.09 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .96.28. చెన్నైలో పెట్రోల్ రూ. 101.79, డీజిల్ రూ. 97.59. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 108.64, డీజిల్ ధర రూ. 101.66. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 108.08, డీజిల్ ధర రూ. 98.89. పాట్నాలో పెట్రోల్ ధర రూ. 107.64, డీజిల్ ధర రూ. 99.72. రాంచీలో పెట్రోల్ ధర రూ. 98.94, డీజిల్ ధర రూ. 98.34. లక్నోలో పెట్రోల్ ధర రూ. 101.47, డీజిల్ రూ. 93.61. భోపాల్‌లో పెట్రోల్ ధర రూ. 113.00, డీజిల్ ధర రూ. 102.29. చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ. 100.53, డీజిల్ ధర రూ. 92.90
మీ ఏరియాలో పెట్రోల్, డీజిల్ ధరను ఇలా తెలుసుకోండి.. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధర ప్రతిరోజూ సవరించడం జరుగుతుంది. కొత్త ధరను ప్రతీ రోజు ఉదయం 6 గంటలకు విడుదల చేస్తారు. అయితే, మారిన ఇంధన ధరలను ఇంట్లో కూర్చొనే తెలుసుకోవచ్చు. కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఎస్ఎంఎస్ చేస్తే మీ ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయనేది తెలిసిపోతుంది. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు 9224992249 కి తమ మొబైల్ నుండి RSP తో పాటు సిటీ కోడ్‌ను ఎంటర్ చేసి మెసేజ్ పంపాలి. ఆ తరువాత కాసేపటికే తాజా పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ ఫోన్‌కు సందేశ రూపంలో వస్తాయి. అదేవిధంగా, BPCL కస్టమర్‌లు తమ మొబైల్ నుండి RSP టైప్ చేసి 9223112222 కు SMS పంపాలి. HPCL వినియోగదారులు 9222201122 కు HP రేట్స్ అని టైప్ చేసి SMS పంపాలి.
Also read:
Provident Fund: గుడ్‌న్యూస్.. దీపావళి పండగకు ముందే పీఎఫ్ వడ్డీ.. ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్‌ఓ..!
ఇండియన్ బ్రాడ్‌మాన్ ఎవరో తెలుసా..10 టెస్ట్‌లు మాత్రమే ఆడాడు..11 డబుల్ సెంచరీలు చేశాడు..