Provident Fund: గుడ్‌న్యూస్‌.. దీపావళి పండగకు ముందే పీఎఫ్‌ వడ్డీ.. ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్‌ఓ..!

Provident Fund: పండగ సీజన్‌ వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌)చందాదారులందరికీ ఉద్యోగుల..

Provident Fund: గుడ్‌న్యూస్‌.. దీపావళి పండగకు ముందే పీఎఫ్‌ వడ్డీ.. ఏర్పాట్లు చేస్తోన్న ఈపీఎఫ్‌ఓ..!

Provident Fund: పండగ సీజన్‌ వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్‌)చందాదారులందరికీ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) గుడ్‌న్యూస్‌ చెప్పనుంది. పీఎఫ్‌ ఖాతాదారులకు ఈ ఆర్థిక సంవత్సరానికి (2020-2021) గాను అందించే వడ్డీని దీపావళి పండగకు ముందు వారి ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దాదాపు 6కోట్ల మంది పీఎఫ్‌ చందాదారులకు ప్రయోజనం కలుగనుంది.

కాగా, పీఎఫ్‌ చందాదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర సర్కార్‌ ఇది వరకే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు కేంద్ర కార్మికశాఖ కూడా సమ్మతి తెలిపింది. దీంతో 8.5శాతం వడ్డీ మొత్తాన్ని చందాదారులకు త్వరలోనే అందించేందుకు ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలుస్తోంది. దీపావళి కన్నా ముందే చందాదారులకు ఖాతాల్లో వీటిని జమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది.

ఈ ఆర్థిక సంవత్సరానికి ఇవ్వాలనుకున్న వడ్డీ రేటు (8.5) గత ఏడేళ్లలో ఇదే కనిష్ఠం. 2018లో 8.55 శాతం వడ్డీ ఇవ్వగా.. 2019లో 8.35శాతం అందించింది. అయితే, కరోనా మహమ్మారి సమయంలో విత్‌డ్రాలు పెరగడం, చందాదారులకు నుంచి జమయ్యే సొమ్ము తగ్గిపోవడం వల్లే ఈసారి తక్కువ వడ్డీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఎలా..?

SMS ద్వారా..

అయితే మీ పీఎఫ్ అమౌంట్ చెక్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి SMSగా “EPFOHO UAN LAN” ను 7738299899 కు పంపాలి. ఆ తర్వాత మీ అకౌంట్ లో బ్యాలెన్స్ తోపాటు మీ ఖాతా వివరాలు మీ ఫోన్ నంబరుకు ఒక మెసేజ్ రూపంలో వస్తాయి.

మిస్డ్ కాల్..

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. కాల్ రింగ్ అయిన తర్వాత వెంటనే మీ కాల్ డిస్ కనెక్ట్ అవుతుంది. వెంటనే మీ ఖాతా వివరాలతోపాటు SMS రూపంలో మెసేజ్ గా వస్తుంది.

ఆన్‎లైన్..

* ముందుగా మీ బ్యాలెన్స్ చెక్ చేయడానికి… EPFO ​మెంబర్స్ పాస్ బుక్ పోర్టల్ కు లాగిన్ అవ్వాలి. ఇందుకోసం మీ యూఏఎన్ నంబర్ అవసరం ఉంటుంది.
* ఒక వేళ UAN నంబర్ లేకపోతే ఇ-సేవా పోర్టల్‌కు వెళ్లి నో యూవర్ UAN లింక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ యూఏఎన్ నంబర్ ఆక్టివేట్ కాకపోతే నో యూవర్ UAN లింక్ పై ఉన్న ఆక్టివేట్ UAN లింక్ పై క్లిక్ చేసి నో యూవర్ UAN లింక్ పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత పాస్ బుక్ పోర్టల్ (https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login) కు వెళ్లాలి. లేదా మెంబర్ ఇ-సేవా పోర్టల్ (https: //unifiedportal-mem.epfindia) ద్వారా అదే లింక్ యాక్సెస్ చేయవచ్చు.
* పాస్ బుక్ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత uan నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
* ఈపీఎఫ్ పాస్ బుక్ పోర్టల్ లో లాగిన అయిన తర్వాత డౌన్ లౌన్డ్, వ్యూవ్ పాస్ బుక్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ అమౌంట్ కనిపిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Amazon Prime: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో మ‌ళ్లీ మంత్లీ స‌బ్‌స్కిప్ష‌న్ ఆప్ష‌న్‌.. ధరల వివరాలు

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.53వేల ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌కు బదులు రెండు నిర్మ సబ్బులు.. వీడియో వైరల్‌

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu