Amazon Prime: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో మళ్లీ మంత్లీ సబ్‌స్కిప్షన్ ఆప్షన్.. ధరల వివరాలు
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల..
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల సౌకర్యం కోసం మరో ఆప్షన్ అందిస్తోంది. అదే సబ్‌స్కిప్షన్ రద్దు ఆప్షన్. ప్రైమ్ మెంబర్‌షిప్ నెలవారి సబ్‌స్క్రిప్షన్ సేవలను తిరిగి ప్రారంభించింది. దీంతో కొత్తగా ప్రైమ్ మెంబర్‌షిప్ సేవలను ప్రయత్నించే వారికి మంచి అవకాశమనే చెప్పాలి. ప్రైమ్ మెంబర్‌షిప్ సేవలను నెల రోజుల పాటు పొంది, నచ్చకపోతే ప్రైమ్ మెంబర్‌షిప్ వెంటనే రద్దు చేసుకునే వెసులుబాటు ఉంది. ఇది వినియోగదారులు సౌకర్యంగా ఉంటుందని అమెజాన్ చెబుతోంది.
సబ్‌స్క్రిప్షన్ ధరల వివరాలు:
► అమెజాన్ ప్రైమ్‌వార్షిక ప్రణాళిక ధర రూ. 999,
► మూడు నెలల ప్లాన్ అసలు ధర రూ.387 కాగా, ప్రస్తుతం రూ. 329కే అందుబాటులో ఉంది
► నెలవారీ చందా. రూ. 129లకే అందజేస్తోంది. కానీ ఇది ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులకు మాత్రమే వర్తించనుంది.
అమెజాన్ ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ నెల వారి సబ్‌స్క్రిప్షన్ తీసి వేసింది. మూడు నెలలు, సంవత్సరం సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. కారణం ఆర్బీఐ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ కార్డు రూల్స్‌పై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పునరావృతమయ్యే లావాదేవీలపై ఆర్బీఐ కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నెలవారి సబ్‌స్క్రిప్షన్ కేవలం సెలక్టెడ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతోనే పొందవచ్చును. నెట్‌ఫ్లిక్స్ తరహాలో ఉచిత ఒకనెల ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ తీసివేసిన విషయం తెలిసిందే. దీంతో అమెజాన్ తిరిగి వినియోగ దారుల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
అడ్వాన్‌టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్..
అమెజాన్ ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ (యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘అడ్వాన్‌టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను విడుదల చేసింది. ‘అడ్వాన్‌టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ తెలుసుకోండి. ఈ ప్రోగ్రాం ద్వారా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రైమ్ సభ్యులకు నో కాస్ట్ ఈఏమ్‌ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కేవలం స్మార్ట్‌ఫోన్లకే వర్తించనుంది.