Jackpot: వీడిదేరా అదృష్టం అంటే.. కొడుకు చేసిన చిన్న పొరపాటు తండ్రిని కోటీశ్వరుడిని చేసింది..
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పలేము. కొన్ని సార్లు ఎవరూ ఊహించని స్థాయిలో కోటీశ్వరులుగా మారిపోతుంటారు. లక్ ఉండాలే కానీ రాత్రికి రాత్రే..
అదృష్టం ఎప్పుడు, ఎలా తలుపు తడుతుందో చెప్పలేము. కొన్ని సార్లు ఎవరూ ఊహించని స్థాయిలో కోటీశ్వరులుగా మారిపోతుంటారు. లక్ ఉండాలే కానీ రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోవచ్చు.. ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. కొడుకు చేసిన చిన్న పొరపాటు తండ్రిని కోటీశ్వరుడిగా మర్చేసింది. మేరీల్యాండ్‌కు చెందిన అతను రూ .7 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఈ లాటరీని 51 ఏళ్ల ప్రిన్స్ జార్జ్ గెలుచుకున్నారు. ప్రిన్స్ జార్జ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక రోజు తన కొడుకును స్కూలుకి తీసుకెళ్లడానికి వెళ్లానని.. కానీ అప్పుడే తన కుమారుడు తన జాకెట్ కారు డోర్‌లో ఇరుక్కుంది. దాన్ని లాగడం వల్ల అది మురికిగా మారింది. ఆ తర్వాత శుభ్రం చేయడానికి డ్రై క్లీనర్ దుకాణంలో ఇచ్చాను. ఇక్కడే అసలు కథ మొదలైంది.
లాటరీని ఇలా గెలిచాడు..
జార్జ్ జాకెట్ శుభ్రం చేస్తున్నప్పుడు అతని సమీపంలోని టీవీని చూశాడు. అతను $ 2 ఖరీదు చేసే లాటరీ టికెట్ కొన్నట్లు గుర్తుకువచ్చింది. తన వద్ద ఉన్న లాటరీ నెంబర్‌ను సరి చూసుకుంటే తెలిసింది.. అది తన నెంబర్ అని.. దీంతో అతను ఒక్క దెబ్బకే మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకున్నాడు. అంటే దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు.
ఈ లాటరీని గెలుచుకున్న తర్వాత జార్జ్ ఇలా అన్నాడు, ‘ఈ వార్త తెలిసిన వెంటనే నేను షాక్ అయ్యాను. నేను మూర్చపోయాను. ఇప్పుడు లాటరీలో గెలిచిన డబ్బుతో కాలేజీ ఫీజులు, పిల్లలకు బిల్లులు చెల్లిస్తాను. దీనితో పాటు నేను కుటుంబ సభ్యులకు సహాయం చేస్తాను. వెంటనే సెలవులు గడపడానికి వెళ్తాను. అంటూ మీడియాకు తెలిపాడు.
ఇవి కూడా చదవండి: Jammu and Kashmir: 1990 పునరావృతానికి కుట్ర.. హిందువులు, సిక్కుల టార్గెట్‌గా రెచ్చిపోతున్న ఉగ్రవాదులు..
Oil Pulling: ఆయిల్ పుల్లింగ్‌తో అనారోగ్యానికి చెక్ పెట్టండి.. ఎలా చేయాలో తెలుసా?