- Telugu News Photo Gallery Business photos Gmr to expand hyderabad Rajiv Gandhi International Airport with Rs 6300 crore investment report
Hyd Airport Expand: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు జీఎంఆర్ రూ.6300 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్..!
Rajiv Gandhi International Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకల వార్షిక సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచడానికి జీఎంఆర్ గ్రూప్ రూ.6,300 కోట్ల..
Updated on: Oct 11, 2021 | 1:58 PM

Rajiv Gandhi International Airport: హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకల వార్షిక సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచడానికి జీఎంఆర్ గ్రూప్ రూ.6,300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 2024 నాటికి విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యాన్ని ఈ స్థాయికి పెంచనున్నట్లు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ డిప్యూటీ సీఈఓ ఆంథోని క్రోమ్‌బెజ్ పేర్కొన్నారు.

విస్తరణకు అవసరమైన నిధుల్లో అధిక భాగాన్ని బాండ్ల జారీ ద్వారా సమీకరించనున్నట్లు చెప్పారు. ఎయిర్ పోర్టులో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధుల కోసం 30 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2,200 కోట్లు) సమీకరణకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ విదేశాల్లో బాండ్లను జారీ చేయనుందని జీఎంఆర్ గ్రూప్ ఈ ఏడాది జనవరిలో వెల్లడించింది.

జీఎంఆర్ ఇన్‌ఫ్రా నుంచి విమానాశ్రయ వ్యాపారాన్ని వేరుచేసే ప్రక్రియ సంవత్సరాంతానికి పూర్తవుతుందని ఆంథోని పేర్కొన్నారు.

వచ్చే మూడేళ్ల కాలంలో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ఈ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని జీఎంఆర్ గ్రూప్ నిర్ణయించుకుంది.




