- Telugu News Photo Gallery Business photos Au small finance bank festive special offer till 7 november discount on processing fees
Small Finance Bank: పండగ సీజన్‌లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ప్రత్యేక ఆఫర్లు.. వివిధ రుణాలపై బంపర్ ఆఫర్..!
Small Finance Bank: పండగ సీజన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. హోమ్ లోన్స్‌తో పాటు ఇతర లోన్స్‌పై ..
Updated on: Oct 12, 2021 | 12:05 PM

Small Finance Bank: పండగ సీజన్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నాయి. హోమ్ లోన్స్‌తో పాటు ఇతర లోన్స్‌పై వడ్డీ శాతం తగ్గించాయి. ఇక తాజాగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దేశ వ్యాప్తంగా వినియోగదారులకు ప్రత్యేక పండగ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ నవంబర్ 7వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది.

బ్యాంకు జారీ చేసిన ప్రకటన ప్రకారం.. బ్యాంకు స్కీమ్స్, బంగారంపై రుణవం వంటి పరిమిత కాల వ్యవధి రుణ పథకాలకు ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.

అదే విధంగా వ్యవసాయానికి సంబంధించిన రుణాల ప్రాసెసింగ్ ఫీజులో 0.20 శాతం, సురక్షిత వ్యాపార రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులో 0.50 శాతం, వాహనాల కొనుగోలు రుణాలకు సంబంధించి వాటిలో ప్రాసెసింగ్ ఫీజు 50 శాతం వరకు రాయితీ కల్పిస్తోంది.

షాపింగ్ ధమాకా ఆఫర్: ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ద్వారా షాపింగ్ ధమాకా ఆఫర్ కూడా ప్రారంభించింది. ఇది అక్టోబర్ 4 నుంచి ప్రారంభం కాగా, నవంబర్ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బ్యాంకు తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డులతో షాపింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది.

కొన్ని నెలల కిందటి నుంచి ఈ బ్యాంకు క్రెడిట్ కార్డులను సైతం జారీ చేస్తోంది. దేశంలో క్రెడిట్ కార్డులు జారీ చేసిన మొట్టమొదటి చిన్న ఫైనాన్స్ సంస్థ.




