- Telugu News Photo Gallery Business photos Big C Dasara, Diwali Festival Offers on Smartphone.. Buy latest Mobiles and Accessories from Bigc
Big C Festival Offers: పండగ సీజన్‌లో బిగ్ సి గుడ్‌న్యూస్.. స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు..!
Smartphone Festival Offers: పండగ సీజన్ వచ్చేయడంతో ఆన్‌లైన్‌లో, ఇతర షాపింగ్ మాల్స్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్..
Updated on: Oct 14, 2021 | 9:38 AM

Smartphone Festival Offers: పండగ సీజన్ వచ్చేయడంతో ఆన్‌లైన్‌లో, ఇతర షాపింగ్ మాల్స్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్, ఆఫర్లు కల్పిస్తున్నాయి. అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఎన్నో ఆఫర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇక తాజాగా మొబైల్ విక్రయ సంస్థ బిగ్ సి దసరా పండగ సందర్భంగా ఆఫర్లు ప్రకటించింది. మొబైల్ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, వడ్డీ, డౌన్ పేమెంట్ లేని సులభ వాయిదాల్లో కొనుగోలు చేసే సదుపాయాన్ని తీసుకువచ్చింది. అంతేకాదు.. బహుమతులు కూడా ఇస్తున్నట్లు సంస్థ సీఎండీ బాలు చౌదరి వెల్లడించారు.

మొబైల్ కొనుగోళ్లపై బజాజ్ ఫైనాన్స్ ద్వారా రూ.3500 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో రూ.1500 వరకు, అమెజాన్ పేతో రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తున్నట్లు వెల్లడించారు.పేటీఎం మాల్‌తో ఓపో మొబైల్ కొనుగోలు చేస్తే 15 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.

ఐఫోన్‌లపై రూ.6 వేల వరకు, శామ్‌సంగ్ మొబైళ్లపై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్, వన్‌ప్లస్ మొబైళ్లపై రూ.7 వేల వరకు రాయితీ, అలాగే ఎంఐ స్మార్ట్‌ఫోన్‌లపై రూ.3వేల వరకు, వివో మొబైళ్లపై 10 శాతం, ఓపో మొబైళ్లపై రూ.4 వేల వరకు, స్మార్ట్‌టీవీలపై రూ.4500 వరకు క్యాష్‌బ్యాక్ అందజేస్తున్నామని తెలిపారు.




