Jammu and Kashmir: 1990 పునరావృతానికి కుట్ర.. హిందువులు, సిక్కుల టార్గెట్‌గా రెచ్చిపోతున్న ఉగ్రవాదులు..
జమ్ము కశ్మీర్ ఏం జరగుతోంది..? మళ్లీ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారా..? ఆ నాటి దారుణాలకు తెరలేపుతున్నారా..? కశ్మీరీ పండిట్లు, సిక్కులను తరిమేసేందుకు ప్లాన్ చేస్తున్నారా..?
జమ్ము కశ్మీర్ ఏం జరగుతోంది..? మళ్లీ ఉగ్రమూకలు రెచ్చిపోతున్నారా..? ఆ నాటి దారుణాలకు తెరలేపుతున్నారా..? కశ్మీరీ పండిట్లు, సిక్కులను తరిమేసేందుకు ప్లాన్ చేస్తున్నారా..? మళ్ళీ ఉగ్రమూకల అలజడి మొదలైందా..? 1990నాటి పరిస్థితిని తీసుకొచ్చేందుకు స్థానిక ఉగ్రమూకలు కుట్రలు చేస్తున్నాయా..? అవునంటున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. తాజాగా 700 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన తర్వాత కాని అసలు సంగతి తెలియలేదు. ఇది తెలిసిన తర్వాత భద్రత బలగాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కశ్మీర్ లోయలో గత వారం రోజుల్లో జరిగిన దాడులు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు వివిధ ప్రదేశాల్లో మొత్తం ఐదుగురు పౌరులను కాల్చి చంపారు ఉగ్రవాదులు. వారిలో అత్యధికులు మైనారిటీ వర్గాలకు (ముస్లిమేతరులు) చెందినవారే ఉండటంతో అనుమానాలు మొదలయ్యాయి. శ్రీనగర్‌లో ఆశ్రయం పొందిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు.
జమ్ము కశ్మీర్ ప్రత్యేక స్వయంప్రతిపత్తి(370 ఆర్టీకల్)ని రద్ధు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆతర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కశ్మీర్ మొత్తం భారత్‌తో భాగమైందని భారతీయులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో కొత్త కుట్రలకు తెరలేపారు భారత వ్యతిరేక శక్తులు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ తీసుకున్న నిర్ణయంపై రచ్చ చేయడం మొదలు పెట్టాయి. మరోవైపు దేశ సరిహద్దుల్లో వేలాదిగా నక్కి ఉగ్రవాదలను దేశ సరిహద్దులు దాటించేందుకు ప్రయత్నించి విఫలమైంది పాకిస్తాన్. దీంతోపాటు అతర్గతంగా జమ్ము మెజారిటీ వర్గాన్ని మైనార్టీ వర్గాలపైకి ఉసిగొల్పుతోంది. స్థానిక మైనార్టీ వర్గాలను తరిమికొట్టేందుకు స్కెచ్ వేస్తోంది.
1990లో ఏం జరిగింది..
ఈ కొత్త కశ్మీర్‌లో ప్రస్తుతం 1990 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానిక మైనార్టీ వర్గాలు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1990 ఏడాది జనవరి 19న రాత్రి సమయంలో.. కశ్మీర్‌లోని మసీదుల నుంచి హెచ్చరికలు వినిపించాయి. కశ్మీరీ పండిట్ పురుషులు లోయ నుంచి వెళ్లిపోవాలని.. మహిళలను అక్కడే వదిలి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ మద్దతుగా ఉన్న స్థానిక ఇస్లామిక అతివాదులు కశ్మీర్ వీధుల్లో ఆజాదీ నినాదాలు చేశారు. ఆ సమయంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఆనాటి గందరగోళంలో ఎందరో ప్రముఖ కశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారు. జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) ఈ దారుణాలకు ఒడిగట్టిది. ఆ సమయంలో నిరాయుధులైన నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని సైతం జెకెఎల్ఎఫ్ టెర్రరిస్టులు చంపేసింది. అప్పటి భారత హోం మంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తెను కిడ్నాప్ చేసి హత్య చేసింది. నెక్స్ట్ మీరే అంటూ రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు ఓ లిస్టును కూడా విడుదల చేసింది. ఈ హత్యలకు జెకెఎల్ఎఫ్ పాల్పడింది. ఈ ఘటనలతో భయభ్రాంతులకు గురైన నాలుగు లక్షల మందికి పైగా కశ్మీరీ హిందు పండిట్లు లోయను విడిచి వెళ్లిపోయారు.
ఇప్పుడు అదే జరుగుతోందా..
మూడు దశాబ్దాల తర్వాత అందమైన కశ్మీర్ లోయల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కశ్మీర్ సరిహద్దు గ్రామాలతోపాటు లోయల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. టెర్రరిస్టులకు అడ్డుకట్ట వేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. ఇది అభివృద్ధిని జీర్ణించుకోలేక పోతున్న పాపిస్తాన్.. లోయల్లో మిగిలిపోయిన మైనార్టీ వర్గాలను పూర్తి స్థాయిలో తరిమివేసేందుకు స్థానికులను ఉపయోగించుకుంటోంది.
ఇప్పుడు అక్కడి వాతావరణాన్ని తమ దాడులకు అనువుగా మార్చుకుంటోంది. చీకటి పడటమే ఆలస్యం దాడులు జరపాలను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. హిందు మైనారిటీ కమ్యూనిటీకి (ముస్లిమేతరులు) చెందిన స్వీట్ షాప్ యజమానులు, పండ్ల విక్రేతలపై దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా ఇండిపెండెంట్స్ గుర్తించాయి. దీంతో స్థానికులను ముందు జాగ్రత్త చర్యగా త్వరగా త్వరగా ఇళ్లకు వెళ్లాలని సూచించినట్లుగా సమాచారం. ఎందుకంటే లాల్ చౌక్ పడకముందే లాల్‌చౌక్ పరిసరాల్లోని మార్కెట్లను మూసివేస్తున్నారు.
శ్రీనగర్‌లో ఆశ్రయం పొందిన ఇస్లామిక్ తీవ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు. కశ్మీర్, అక్కడి మైనారిటీలను అస్థిరపరచాలనే లక్ష్యంతో వారు ఇలా చేస్తున్నారు. భారత ప్రజాస్వామాన్ని గౌరవించేవారు, కశ్మీర్‌లో సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన వారినే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి: Shiba Inu: బిట్ కాయిన్‌ను మించి పరుగులు.. 260 శాతం పెరిగిన శిబా ఇను.. మీరు కూడా..
Income Tax: ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు.. చట్టం ఏం చెబుతోంది.. పూర్తి వివరాలు..
Viral Video: ఇది మామూలు మార్జాలం కాదురో.. స్పైడర్‌మాన్‌లా గోడపై పరుగులు పెట్టిన పిల్లి..